-ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటి..
- ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో ప్రోటెం స్పీకర్ పాత్ర.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. అంతేకాకుండా నాలుగవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 24 మంది మంత్రులు కూడా ఎంపికయ్యారు. ఇదే తరుణంలో మొత్తం కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి ఇందులో ప్రోటెం స్పీకర్ పాత్ర ఏమిటి.. ఆయన నియామకంలో అనుసరించే పద్ధతులు ఏమిటి..ప్రస్తుతం టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రోటెం స్పీకర్ గురించి వెతుకుతున్నారు.. మరి ఆ వివరాలు ఇప్పుడు ఏంటో చూద్దాం.

 ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటి.?
 భారత రాజ్యాంగంలో ప్రోటెం స్పీకర్ అనే  పదం ఎక్కడా లేదు.  కానీ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి అభ్యర్థులంతా విధిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. వారిని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత  గవర్నర్ కు ఉంటుంది.  లేదంటే గవర్నర్ చేత నియమితులైన ఒక వ్యక్తి కి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించే వెసులుబాటు కూడా కల్పిస్తారు.  దీని కోసం గవర్నర్ ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు. వారికి స్పీకర్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారు దీన్నే ప్రొటెం స్పీకర్ అంటారు. ఈ ప్రొటెం స్పీకర్ ఎవరుండాలనే దానిమీద ముఖ్యమంత్రితో చర్చలు జరిపి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో నిర్ణయం తీసుకొని ఎంపిక చేస్తారు. ఒక్కోసారి గవర్నర్ కూడా తను సొంతంగా ప్రొటెం స్పీకర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు.

 ప్రొటెం స్పీకర్ విధులు:
 లోక్ సభ ప్రొటెం స్పీకర్ పద్ధతిలోనే శాసనసభ ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యులనే ఎన్నుకుంటూ ఉంటారు. కానీ సీనియర్లనే ఎంపిక చేయాలనే నిబంధన లేదు. ప్రోటెం స్పీకర్ కోసం  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందిస్తుంది. ఆ తర్వాత అందులో నుంచి గవర్నర్ ఒకరిని ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేస్తారు. లోక్ సభలో అయితే ఈ బాధ్యత రాష్ట్రపతి తీసుకుంటారు. సాధారణంగా అయితే ఎన్నికలు జరిగినా వెంటనే ప్రొటెం స్పీకర్ ను నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడం స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు సభ్యులందరితో సఖ్యతగా మెదలడం వీరి యొక్క బాధ్యతలు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్పీకర్లకు, డిప్యూటీ స్పీకర్లకు ఉన్నటువంటి  అధికారాలు ప్రోటెం స్పీకర్ కు ఉండవు. పరిమితులకు లోబడి తన నిబంధన నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రోటెం స్పీకర్ ను ఎంపిక చేసుకొని అసెంబ్లీ సభ్యులంతా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించి, వారిలో నుంచి స్పీకర్ డిప్యూటీ, స్పీకర్లను ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: