ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు. జగన్ టార్గెటుగా పావులు కదుపుతోంది ఏపీ బీజేపీ పార్టీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలను వెలికి తీయాలని చంద్రబాబుకు ఏపీ బీజేపీ వివతి అందజేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు 3 వినతులిచ్చారు బీజేపీ పార్టీ నేతలు. గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపాలని ఏపీ సీఎంకు బీజేపీ బృందం వినతి అందించింది.


ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ చిన్నమ్మ ఎంపీ పురంధేశ్వరి కూడా లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్ పై ఎంపీ పురంధేశ్వరి లేఖ రాయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చెయ్యాలని డిమాండ్‌ చేశారు పురంధేశ్వరి. అటు ఇప్పటి వరకూ ఉన్న డిస్టిలరీస్ పై విచారణ జరిపించాలని ఈ లేఖలో డిమాండ్‌ చేశారు. ముడి సరుకుల వినియోగం, లిక్కర్ తయారీ పై విచారణ జరగాలని. పేర్కొన్నారు.


ఇథనాల్ కంటే సగం ఖర్చుతో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై విచారణ జరగాలని చంద్రబాబుకు రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు ఎంపీ పురంధేశ్వరి.  కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగం పరిశీలించాలని... కలర్, ప్లావర్ ల కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపై విచారణ చేయించాలని కోరారు. 6 నుంచీ 12 నెలలు చెక్క బ్యారెల్స్ లో నిల్వ ఉంచిన ఆల్కహాల్ ను బాటిళ్ళలో నింపేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

శాంపిల్స్ ను ప్రతీవారం నేషనల్ లేబొరేటరీ లలో పరీక్షలు జరిపించాలని... డిజిటల్ చెల్లింపులను పూర్తిస్ధాయిలో అమలు పరచాలని కోరారు. పరివర్తన తీసుకొచ్చేందుకు రిహేబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రం అంతా ప్రారంభించాలని... బలవంతంగా లీజుకు తీసుకున్న లిక్కర్ తయారీ కేంద్రాలను తక్కువ రేట్లకే తిరిగి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. బ్రూవరీస్ కార్పొరేషన్ లో కరప్షన్ పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: