తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తిరుగులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఏకంగా విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయ్. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఒక్కసారి ప్రతిపక్ష హోదాలోకి రాగానే.  ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా బిఆర్ఎస్ పార్టీలోనీ కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కారు పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఆ పార్టీ నుంచి జంపింగ్ జీలానీల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది తప్ప తగ్గడం లేదు.


 దీంతో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే.. రానున్న రోజుల్లో కారు పార్టీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది అన్నది అందరిలో మనసులో మెదులుతున్న ఆలోచన. ఎందుకంటే ఆ పార్టీలోని కీలక నేతలే పార్టీని వీడుతున్న  సమయంలో ఇక సదాసీదా నేతలుగా ఉన్నవారు ఎప్పుడు ఛాన్స్ వస్తుందో ఎప్పుడు హస్తం పార్టీలోకి వెళ్లిపోదామా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదా అనుభవించి ఇక ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఒక నేత కారు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి గంగుల కమలాకర్. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఒక్క పోస్టుతో ఇక పార్టీ మారబోతున్నారు అంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.


 హోం శాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ ను అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఎన్నో చర్చలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఆయన బిజెపిలో చేరడం ఖాయం అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే గంగుల కమలాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఈ వీరిద్దరూ టిడిపిలో ఉన్నప్పుడు వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగింది. దీంతో మాజీ మంత్రి గంగుల అటు కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. దశాబ్ద కాలం నుంచి కారు పార్టీలోనే జర్నీ చేస్తున్నారు గంగుల. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యాగోచరంగా తయారు కావడంతో తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు.. పార్టీ మారబోతున్నారంటూ పుకార్ల షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి ప్రచార నేపథ్యంలోహోం శాఖ సహాయ  మంత్రిగా ఎన్నికైన బండి సంజయ్ ను అభినందిస్తూ గంగుల పోస్ట్ పెట్టడం ఈ చర్చకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రచారంతో ఏకంగా పార్టీ క్యాడర్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పార్టీ మారుతారు అనే ప్రచారంపై గంగుల కూడా సైలెంట్ గా ఉండడం గమనార్హం. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: