వినాయక చవితి పండుగ వచ్చింది అంటే చాలు ఊరువాడ ఎంతటి సందడి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని ప్రతిష్టించుకుని ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక వినాయక చవితిని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వినాయకుడి నిమర్జనం ఊరేగింపు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇక ఇలా వినాయక చవితి వచ్చినప్పుడల్లా ఊరువాడ అనే తేడా లేకున్నా అంతటా షెడ్స్ వేసుకొని వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకోవడం చూస్తూ ఉంటామ్. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా ప్రతి చోట వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఇలా వినాయకుడిని ప్రతిష్టించుకున్న.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ లో ప్రతిష్టించే వినాయకుడిని ఎంతో ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. ఏకంగా 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ వినాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అని చెప్పాలి.


 అందుకే వినాయక చవితి వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఖైరతాబాద్కు చేరుకొని గణేషుడిని చూసి మైమరచిపోతూ ఉంటారు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణపతిని ఎన్ని అడుగులు ప్రతిష్టించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది ఏకంగా 63 ఫీట్లలో శ్రీ మహాగణపతి విగ్రహాన్ని తయారు చేయగా.. వరల్డ్ టాలెస్ట్ విగ్రహంగా రికార్డు సృష్టించింది. అయితే 2024లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే 70వ వార్షికోత్సవం సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారట. సాధారణంగా విగ్రహం ఎత్తులో ప్రతి ఏటా ఒకటి లేదా రెండు ఫీట్ల హెచ్చుతగ్గులు మాత్రమే ఉండేవి. కానీ గత ఏడాది కంటే ఈసారి ఏడు ఫీట్లు ఒకేసారి పెంచబోతున్నారు. 1954లో ఒక్క ఫీట్ విగ్రహంతో మొదలైన ఈ గణపయ్య ప్రయాణం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: