ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన టిడిపి జనసేన బిజెపి పార్టీల కూటమి.. ఇటీవల ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా ఏకైక ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఇక మూడు పార్టీల నుంచి మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసి.. శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. కాగా ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారు.. నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పాలి.


 కాగా నేటి నుంచి రెండు రోజులపాటు అటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయ్. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరు చేత ఇక శాసనసభలో ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. ఇక రెండో రోజు ఇలా ఎమ్మెల్యేలుగా ఎంపికైన సభ్యులందరూ కూడా స్పీకర్ను ఎన్నుకోబోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ సమావేశాలకు స్థల భావంతో సందర్శకులకు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు అని చెప్పాలి. అయితే ఇలా నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అందరిలో ఒకే ప్రశ్న నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయాన్ని   చవి చూసింది. దీంతో ఇక మాజీ సీఎం జగన్ అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.అయితే వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకునే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానంలో కనీసం 18 శాతం అయినా సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ వైసీపీకి అంత మొత్తంలో సీట్లు దక్కకపోవడంతో ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap