ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11తో సరిపెట్టుకుంది. 151 సీట్ల నుంచి పడిపోయి ఘోర ఓటమిని చవిచూసింది. ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు, పార్టీ, దాని నాయకులు పెద్దగా బాధపడటం లేదని తెలుస్తోంది. వాళ్లు మళ్లీ యాక్టివ్ గా మారడానికి కనీసం ఒకటి రెండు సంవత్సరాల సమయం పడుతుంది అని చాలామంది అనుకున్నారు కానీ వారు అంచనాలు తప్పయ్యాయి.

 వైసీపీ పార్టీలో అంబటి రామబాబు, రోజా, కొడాలి నాని తదితర నేతలు తమ నోటికి వచ్చింది మాట్లాడుతారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలను వారు దారుణంగా విమర్శిస్తారు. అయితే వీళ్లు ఓడిపోయాక బయటికి అసలు రారు అనుకున్నారు కానీ వారిలో ఏమాత్రం ధైర్యం తగ్గలేదు. ముగ్గురూ తమ నియోజకవర్గాల్లో భారీ ఓటములను ఎదుర్కొన్నా వారు వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే అంబటి ఓ మీడియా సమావేశంలో పాల్గొని పోలవరం ప్రాజెక్టుపై చర్చించగా, రుషికొండ ప్యాలెస్ ను రోజా సమర్థించారు.ఫర్నీచర్‌ దొంగతనం ఆరోపణలపై జగన్‌ను సమర్థించడం ద్వారా కొడాలి నాని ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చారు.  అంబటి, రోజా, కొడాలి గత ఐదేళ్లుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చివాట్లు తిన్నారు. భారీ పరాజయాలను చవిచూసిన తర్వాత వారు కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటారని భావించారు.

 ఇకపోతే జగన్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉందని కొడాలి నాని అన్నారు. ఎన్నికల లెక్కింపు తేదీ తర్వాత టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇళ్లలోకి వెళ్ళిన వస్తువులను ధ్వంసం చేయడం, కార్యకర్తలపై దాడులు చేయడం వంటి హింసాత్మక ఘటనలు పలుచోట్ల చోటు చేసుకున్నాయి. అయితే వైసిపి కోసం ఎంతో కష్టపడిన వారికి ఇలా జరగడంతో జగన్ బాగా బాధపడ్డారు అందుకే వారిని పరామర్శించడానికి వెళ్ళనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: