తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీ కావడంతో... అందులో ఉన్న కీలక నేతలు అందరూ.. ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే.. గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో షాక్ లో ఉన్న గులాబీ పార్టీకి... తాజాగా మరో షాక్ తగిలింది.

కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, లక్ష్మీ పుత్రుడుగా పేరుగాంచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వెళ్లారు.  మాజీ స్పీకర్, బాన్స్ వాడ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రావడంతో... వారికి ఆహ్వానం పలికారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఈ సందర్భంగా... కాంగ్రెస్ పార్టీలోకి రావాలని... పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆహ్వానo పై పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతుంది. పార్టీ మారడంపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని... పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. కాగా... కెసిఆర్ పాలనలో స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలు అందించారు. ప్రతి విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్.

అయితే... తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి అత్యంత దారుణా పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన గులాబీ పార్టీ.. పార్లమెంటు ఎన్నికల్లో కూడా జీరోకి పడిపోయింది. దీంతో చాలా మంది అధికార పార్టీ కాంగ్రెస్ లేదా బిజెపి పార్టీలోకి  వెళ్లేందుకు... సన్నద్ధమవుతున్నారు. అయితే..  పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళతారా ?  లేదా? అనేది ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: