ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నేడు మొదలయ్యాయి. శాసనసభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆ తర్వాత కూటమి మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు 81 మంది కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆరుగురు కొత్త సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
 
ఎమ్మెల్యేలలో ఇద్దరు మాజీ ఐఏఎస్ లు ఉండగా శ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో జగన్ వాహనానికి అనుమతి ఇచ్చి జగన్ కు ప్రోటోకాల్ కు మించి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ వాహనానికి అనుమతి ఇస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల 46 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కాగా రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
 
టీడీపీ జగన్ వాహనానికి అనుమతి ఇవ్వడం ద్వారా కక్ష సాధింపులకు చెల్లు అనేలా వ్యవహరించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా జగన్ సాధారణ ఎమ్మెల్యేనే అయినా కూటమి ప్రభుత్వం జగన్ కు ప్రాధాన్యత ఇవ్వడం కొసమెరుపు. అసెంబ్లీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ నమస్కారం చేశారు. మరోవైపు అసెంబ్లీలోకి పవన్ ఎంట్రీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
 
పదేళ్ల తర్వాత పవన్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసెంబ్లీలోకి పవన్ ఎంట్రీ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సంచలన విజయాలను సాధించడానికి సరైన తరుణం వచ్చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ప్రమాణ స్వీకారం చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కగిలిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: