దాదాపు రెండున్నర సంవత్సరాల కిందట ఏపీ శాసన సభలో టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబును వైసీపీ సభ్యులు అత్యంత హేయంగా అవమానించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే కాలం ఊరుకోదు కదా. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెబుతుంది. ఇక ఆ అవమానం తరువాత 2021 నవంబరు 19న చంద్రబాబు ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతే ఇక్కడ తిరిగి అడుగు పెడతానని శపథం చేయడం జరిగింది. ఈ కౌరవ సభలో తాను ఉండబోనని, ముఖ్యమంత్రిగా గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానని అన్నారు.

ఇక అన్న మాట ప్రకారం చంద్రబాబు అఖండ విజయం సాధించిన తర్వాత ఈరోజు ఎంతో భావోద్వేగం నడుమ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. మొదట అసెంబ్లీ మెట్లకు ప్రణామం చేసిన చంద్రబాబు శాసన సభలో ముఖ్యమంత్రి హోదాలో నాలుగోసారి అడుగుపెట్టారు. ఇక బాబు అసెంబ్లీలో హుందాగా అడుగు పెట్టగానే టీడీపీ సభ్యులంతా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో కౌరవ సభ పోయి గౌరవ సభ వచ్సింది అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్ చేసిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.

ఈ నేపథ్యంలో ముందుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ తర్వాత మిగతా సభ్యులు అనిత వంగలపూడి, కింజారపు అచ్చెన్నాయుడు మిగిలినవారు ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ క్రమంలో పేర్ల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: