రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారందరి వద్ద రాజీనామాలు తీసుకుని, నియమ నిబంధనల ప్రకారం తొలగించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదికివ్వాలని ఆదేశించింది. బాబు ఆదేశాల మేరకు వారందరినీ తప్పిస్తూ నీరబ్‌ కుమార్‌ ఈ రకంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఇకపోతే, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో రిటైర్డైన కొందరు ఉద్యోగులను కొనసాగించడం జరిగింది. కాగా వారు నేటికీ ఆయా శాఖల్లో పనిచేయడం జరుగుతుంది. వీరి సేవలపై ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. వారందరు వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకి చెందిన ఉద్యోగులు కొందరు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల రిలీవ్‌పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.

ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో కొలువు దీరింది. మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొదట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ పిదప మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇకపోతే నీరభ్ కుమార్ రిటైర్ ఉద్యోగుల విషయంలో అన్ని శాఖల HODలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను అప్రమతం చేసారు. తొలగింపుల పై ఈ నెల 24వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: