వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురుము ఉన్నాం... అందరినీ చంపించేయండి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వారు ఉండరు. కాపుల కోసం అనేక ఉద్యమాలు చేశారు ముద్రగడ. అయితే మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వైసీపీ పార్టీలోకి వెళ్లారు ముద్రగడ పద్మనాభం.


దీంతో అప్పటినుంచి... తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు... అందరూ దారుణంగా ముద్రగడని ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... ముద్రగడను టార్చర్  చేస్తున్నారు. ఇక... ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టార్చర్ మరింత ఎక్కువగా అయింది. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.


మేము అనాధలం ఎవరు అడ్డుకోరు... ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమా లు వదిలేసి ప్రజాసేవ చేయాలని డిమాండ్‌ చేశారు. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరానని తెలిపారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నాను... పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి.


వైసీపీ సానుభూతిపరులు ఇళ్లపై దాడులు చేస్తున్నారు వెంటనే  ఆపాలని కోరారు. నేను చేతకాని వాడిని అసమర్థుడు ను కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరానని స్పష్టం చేశారు. కేంద్ర, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలని డిమాండ్‌ చేశారు.  ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కోసం పోరాడాలని కోరారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: