కూటమి ప్రభుత్వం ఏపీ లో సింహాసనం చేపట్టాక వరుస గా కూటమి మంత్రులు వారి వారి బాధ్యతలను చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్  గారు కూడా బుధవారం సచివాలయంలోని కార్యాలయం లో పూజలు నిర్వహించి తన బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భం గా శాసనసభ ఏర్పాట్లకు సంబంధించిన దస్త్రం పై తొలి సంతకం కూడా చేసి ఈరోజు మరియు రేపు అసెంబ్లీ నిర్వహణ జరిగేలాగా చేశారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే సమావేశాలకు వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రావాలని, సమస్యల పై మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.అయితే తాము ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సభ లో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నాను.తమ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకం గా వ్యవహరిస్తామని చెప్పిన కూటమి సర్కార్ అదే తరహా లో పరిపాలన చేస్తుంది.ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రుల వాహనాలతో సమానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెహికిల్ ను అనుమతించేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ.అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి గా ఆయనకు గౌరవిస్తూ ఆయన్ను ప్రోటోకాల్ ప్రకారం లోపలికి అనుమతించినట్లు శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి పయ్యావుల తెలిపారు.దాంతో గత వైసీపీ ప్రభుత్వం చేసినట్లుగా కక్ష సాధింపులు తమ కూటమి ప్రభుత్వం చేయదని అందుకే మాజీ సీఎం ఐనా జగన్ కు మంచి ప్రాధాన్యత ఇచ్చింది కొత్త ప్రభుత్వం. ప్రస్తుతం ఇదే సంఘటన అసెంబ్లీ లో  హైలెట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: