ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడేందుకు... కీలక నేతలు ఎదురుచూస్తున్నారట. ఐదు సంవత్సరాల పాటు అధికారం లేకపోతే చాలా కష్టమని చాలా మంది నేతలు భావిస్తున్నారట. మొన్నటి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి.. దక్కే పరిస్థితి లేదు.


ఇక అటు తెలుగుదేశం కూటమికి ఏకంగా 164 స్థానాలు దక్కడంతో... ఆ పార్టీలో ఉన్న అగ్ర నేతలు రెచ్చిపోతున్నారు. వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసిపిలో ఉన్న కొంతమంది లీడర్లు బిజెపిలోకి జంపు కావాలని చూస్తున్నారట. ఇదే విషయాన్ని... తాజాగా...బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 
బీజేపీలో చేరేందుకు మిధున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని బాంబ్‌ పేల్చారు ఆదినారాయణ రెడ్డి.  వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని... స్వయంగా మిధున్ రెడ్డి కూడా... బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు  బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.

కానీ బీజేపీ నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోందని... కానీ మేం చేరతామంటూ మిధున్ ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారని బాంబ్‌ పేల్చారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిధున్ ఒత్తిడి తెస్తున్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామని... మద్యం, ఇసుక మాఫియాల  మీదే కాకుండా చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందని ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయని.. జగన్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: