తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నెలల్లో  రాజకీయాలు చకచకా మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండు పర్యాయాలు కేసిఆర్ ఏకధాటిగా పాలన చేశారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. చివరికి 2023  ఎలక్షన్స్ లో  చాలా దారుణమైన ఓటమిని చవిచూశారు. ఈ విధంగా ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు కూడా కేసీఆర్ అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా పాలన చేసినన్ని రోజులు  అహంకార భావంతో మెదిలారు. నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా పాలన చేశారు. దీంతో కిందిస్థాయి ప్రజల్లో చాలావరకు మైనస్ అయ్యారు. చివరికి ప్రజలు అంత పని చేస్తావా కేసీఆర్ అంటూ తీసి నేలకు కొట్టేశారు.

 ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయినా సత్తా చాటుదామని, కేసీఆర్ బస్సు యాత్రతో బయటకు వచ్చారు. అది కూడా ఫలించలేదు. చివరికి పార్లమెంటు ఎలక్షన్స్ లో కనీసం  ఒక్క సీటు కూడా దక్కక పోవడమే కాకుండా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదట. 9 సంవత్సరాలు ఏకాదాటిగా పాలించిన ఈ పార్టీ ఒక్కసారి పాతాళానికి పడిపోవడంతో  బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆందోళన చెందుతున్నారట. దీంతో పార్టీని ఎలాగైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దగ్గర చేయాలనే ఆలోచనతో ఉన్నారట. పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసి  ప్రస్తుతం ఉన్న నాయకులందరినీ తీసేయాలనే ఆలోచనకు వచ్చారట.  

ముఖ్యంగా పార్టీలో కీలక పదవి పొందుతున్నటువంటి తన కుమారుడు కేటీఆర్ ను  వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి మరో కీలక నేతకు అప్పగించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరయ్యా అంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం వల్ల  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా  బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారాని కేసీఆర్ ప్లాన్. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీని బలమైన శక్తిగా నిలుపవచ్చని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం  బీసీ, ఎస్టీ వర్గాలంతా  బీఆర్ఎస్ వైపు తప్పక వస్తారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు  కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: