సాధారణంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఎంతోమంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలస వెళ్లడం జరుగుతూ  ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి జంపింగ్లు కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి. ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చేసింది. అయితే ఇక ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో  విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది.


 గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి ఆర్ ఎస్ అధినేత, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అందరినీ కూడా తన పార్టీలో చేర్చుకున్నారో.. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే చేస్తుంది. ఏకంగా ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వరుసగా బిఆర్ఎస్ పార్టీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కేకే, కడియం శ్రీహరి లాంటి కేసిఆర్ ఆప్తులు సైతం కారు పార్టీని వీడారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు సైతం ఇక ఈ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరారు.


 అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తారని కేసీఆర్ కు వరస షాకులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అంచనా వేసిన విధంగానే కారు పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇక మరో కారు పార్టీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా  మారింది. దీంతో ఆయన కూడా ఇక హస్తం గూటికి చేరుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి  అయితే జానారెడ్డి పుట్టినరోజు కావడంతోనే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే అటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వెళ్లారు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: