ఇల్లు అలకగానే పండగ కాదు, ఒకసారి అధికారం రాగానే అది శాశ్వతం కాదు. ఈ సామెత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా సూట్ అవుతుంది. ఒక్కసారి ఏపీలో అధికారంలోకి వచ్చి,  అంతటి  ఘనత ఎవరు సాధించలేదు అనే విధంగా విర్రవిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఆయన కింద ఉన్న మంత్రివర్గం కూడా ఆ విధంగానే ఫీల్ అయిపోయింది. వారికి ఎవరు అడ్డు లేదు, ఇక అధికారం ఎప్పుడైనా మాదే అనే విధంగా ముందుకు వెళ్లిపోయారు.  అంతటి అహంకార ధోరణితో వాళ్లు ఉన్నారు కాబట్టే చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయారు.  చివరికి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు వయసుకు కూడా విలువ ఇవ్వకుండా జైలుకు పంపించారు నిండు అసెంబ్లీలో అవమానించారు. 

 అయినా చంద్రబాబు నాయుడు ఒక్క మాట అనకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. చివరికి పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. ఈనాడు నిండు సభలో కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారో వెళ్లిపోతారో తెలియదు.  అలాంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా అవమానించకుండా హుందాగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది  ఎమ్మెల్యేల యొక్క పేర్ల ఆధారంగా నడుస్తుంది.  ఏ అక్షరం నుంచి జెడ్ అక్షరం వరకు ఉన్న పేర్ల ప్రకారమే మన స్వీకారానికి పిలుస్తారు. ఈ విధంగా చూస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి చివరి వరకు వస్తుంది.  దీంతో అందరూ అయిపోయే వరకు జగన్ వేచి ఉండాలి.  

కానీ జగన్ మాత్రం తనను ప్రమాణ స్వీకారం ముందుగా చేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు.  తన కోరికను గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా  అసెంబ్లీ ప్రవేశ ద్వారం ద్వారా ఎమ్మెల్యేల కార్లను అనుమతించరు. నిజానికి చూసుకుంటే జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేనే. కాబట్టి ఆయన కూడా మిగతా ఎమ్మెల్యే లాగా అసెంబ్లీ ద్వారా వచ్చే అవకాశం లేదు. కానీ జగన్ రిక్వెస్ట్ మేరకు  వాహనాలను అసెంబ్లీ ద్వారం వరకు తీసుకురావడానికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.  ఈ విధంగా జగన్ గౌరవానికి ఎలాంటి భంగం కలవకుండా చూసుకున్నారు. ప్రస్తుతం ఈ సీన్లన్నీ చూసినటువంటి జనాలు కూడా  హుందాతనమంటే చంద్రబాబుది, జగన్ ఇది చూసిన నువ్వు నేర్చుకో, ఇప్పటికైనా మారండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: