మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేతులు మారింది  ఈ క్రమంలోనే టిడిపి జనసేన బిజెపి పార్టీలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికీ మొన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ కూడా ఇక నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు.


 అయితే గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎంత ఘోర పరాజయం ఎదురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆ పార్టీ 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది  దీంతో ఇక రూల్ ప్రకారం కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సంపాదించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇక కేవలం ఒక సాదాసీదా ఎమ్మెల్యే గానే జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీలో అడుగు పెట్టారు అని చెప్పాలి. సాధారణ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట కాన్వాయ్ ని ఆపి అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.


 కానీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రస్తుత సీఎం  చంద్రబాబు వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా మాజీ సీఎం జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలికి అనుమతించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు  ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది  దీంతో చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతిపక్షం విషయంలో ఇక సభ్యులు హుందాగా వ్యవహరించాలని.. తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. చిన్న చిన్న విషయాలకు రాజకీయం చేయవద్దని.. అంతేకాకుండా రాగద్వేషాలకు తావు ఇవ్వవద్దు అంటూ అనుచరులకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు  అయితే ఇలా గతంలో జగన్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ఇప్పుడు సీఎం అయ్యాక చంద్రబాబు హుందాగా వ్యవహరించిన తీరు మాత్రం  ప్రతి ఒక్కరిని ఫిదా చేసేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: