ఆంధ్రప్రదేశ్లోని 2019 ఎన్నికలలో వైసిపి పార్టీ భారీ విజయాన్ని అందుకొని అధికారాన్ని చేపట్టింది.. 2024లో కూటమిలో భాగంగా టిడిపి పార్టీ 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి తరుణంలోని గత ఐదేళ్ల పాలనను టిడిపి నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పైన పలు రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణం జరిగింది అంటూ పలు రకాల ఆరోపణలు తీసుకువచ్చారు.


ప్రజలు తమకు ఓటు వేయడం పైన జగన్ మదన పడుతున్నారని వైసీపీ పాలనలో ఏపీ అరాచకాలకు అప్పులకు దుర్మార్గాలకు అడ్డాగా మారిపోయింది అంటూ సోమిరెడ్డి వివరించారు. వైసీపీ నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని అందుకే ప్రజలు ఏపీని కాపాడాలని ఉద్దేశంతోనే టిడిపికి ఓటు వేశారంటూ వెల్లడించారు. ఆంధ్రాలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందనే విధంగా తమకు ఆరోపణలు వినిపించాయని.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ చాలా కోట్లు దోచుకున్నారు అనే విధంగా తెలియజేశారు. ఈ విషయంలో జైలుకు వెళ్లడం ఖాయమని సోమిరెడ్డి వెల్లడించారు.వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందంటూ వైసీపీ నేతల సమావేశంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈయన ఫైరయ్యారు... జగన్ అరాచకపాలనలకు త్వరలోనే అనుభవిస్తారని అక్రమాస్తుల కేసు విచారణలో మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతారంటూ తెలియజేశారు.. అలాగే సర్వేపల్లి లో దాదాపుగా 1000 కోట్ల భూమిని కాల్ చేశారని ల్యాండ్ మైనింగ్ మాఫియాలతో వేల కోట్లు సంపాదించారనే విధంగా ఆరోపణలు చేశారు. ప్రైవేటు ఎస్టేట్ గా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ని చాలా కుట్రలు చేశారని సోమిరెడ్డి వివరించారు. ఇలాంటి పరిపాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారంటూ సోమిరెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం ఈ టిడిపి నేత చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: