తెలుగుదేశం ప్రభుత్వం.. ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి... కొన్ని కూల్చివేతలకు పాల్పడ్డారు. ఇప్పుడు అదే తరహాలో తెలుగుదేశం కూటమి కూడా ముందుకు వెళ్తోంది. తాజాగా... జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాప్ కి ఇచ్చింది చంద్రబాబు సర్కార్.


తాడేపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని.. దౌర్జన్యంగా కూల్చివేశారు ఏపీ అధికారులు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో...  ఎవరికి సమాచారం ఇవ్వకుండా తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైసిపి కార్యాలయాన్ని కూల్చి వేసేందుకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఇంకా ఆ కూల్చివేత కొనసాగుతోంది. బుల్లోజర్లతో వచ్చి... వైసిపి కార్యాల యాన్ని కుప్పకూల్చుతున్నారు అధికారులు.


స్లాబ్ కు సిద్ధంగా ఉన్న ఆ భవనాన్ని... ఉన్నపలంగా కూల్చివేస్తున్నారు ఏపీ అధికారులు. కూల్చివేతకు సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ...  శుక్రవారం రోజునే ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ. ఈ కేసుపై ... వైసీపీ పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి... ఏపీ హైకోర్టుకు వాదనలను వినిపించారు. చట్టాన్ని మీరు... అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని శుక్రవారం రోజున... హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా వైసిపి పార్టీ కూడా స్పష్టం చేస్తుంది.


అయితే... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిఆర్డిఏ కమిషనర్ కు వైసిపి పార్టీ తెలియజేసింది. ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ... చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో సి ఆర్ డి కమిషనర్... కూల్చివేతలకు పాల్పడుతున్నారని వైసీపీ ఫైర్ అవుతోంది. ఇక నిర్మాణంలో ఉన్న కొత్త భవనాన్ని కూల్చివేయడంపై... మళ్లీ హైకోర్టు  కు వెళ్తామని వైసిపి పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ కూల్చివేతపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.మరింత సమాచారం తెలుసుకోండి: