2019లో వైసీపీ పార్టీ 151 సీట్లతో అఖండ మెజారిటీ సంపాదించింది. అయితే 2024 వచ్చేసరికి కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. దీంతో చాలామంది టీడీపీ నేతలు విమర్శించడం కూడా జరిగింది. అంతేకాకుండా కేవలం సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారని అభివృద్ధికి ఎక్కడ తావు ఇవ్వలేదని కార్యకర్తలను కూడా పట్టించుకోలేదని విధంగా పలు రకాల విమర్శలు వినిపించాయి. దీంతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను ఇటీవలే సమావేశం ఏర్పాటుచేసి వచ్చే ఎన్నికలకు ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తున్నారు.


కొంతమంది కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం పని చేయడం లేదు అని చెప్పడం అమాయకత్వం.. పని జరిగిపోతుంది కాబట్టి పబ్లిసిటీ అవసరం లేదనే విధంగా ఆలోచించారు. ప్రజల దగ్గర ఏ విధంగా బిల్డప్ చేయనవసరం లేదనే విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు సైతం మాట్లాడేవారు. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్లడం జరిగింది. మీడియాతో అసలు మాట్లాడలేదు. కేవలం అక్కడ ఉన్న అధికారులను విచారించి తెలుసుకొని వచ్చేసేవారు. ఈ విషయం పైన ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం జరిగింది.. ముఖ్యంగా ఈయన భాష కూడా చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది.


అలాగే అసెంబ్లీలో కూడా మీడియాని ఫేస్ చేయలేకపోయారు..అలాగే వరదల సమయంలో కరోనా సమయంలో కూడా ఆర్డర్లు వేస్తారు పని జరిగిపోతుంది. అలా చేసినట్లుగా పబ్లిసిటీని ఎక్కడ చెప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా పనులు జరుగుతున్నప్పటికీ ఆ పనులలో మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనే విధంగా చూపించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి విషయాలలో ముందు ఉంటారు.. పోలవరం కానీ, అమరావతి విషయంలో కానీ మరే ఇతర విషయాలలో కానీ చంద్రబాబు పేరుని మీడియా హైలైట్ గా చేస్తూ ఉంటుంది. మీడియాతో స్పందిస్తూ కూడా ఉంటారు. ఇక్కడ వైసిపి అదినేత జగన్మోహన్ రెడ్డి మిస్ అవ్వడమే మైనస్ గా మారింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: