ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో... ముద్రగడ పద్మనాభం రెడ్డికి ఇంట.. బయట... అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ.


అయినప్పటికీ ముద్రగడను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు తన కూతురు  కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ముద్రగడ కుమార్తె క్రాంతి... సంచలన పోస్ట్ పెట్టారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి.. ఇకనైనా మారాలని చురకలంటించారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే హక్కు ముద్రగడ పద్మనాభ రెడ్డికి లేదని క్రాంతి ఫైర్ అయ్యారు. ముద్రగడ పేరు మార్చుకున్నారు కానీ... ఆయన ఆలోచన విధానం మాత్రం... అసలు మారడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ని ఎప్పుడు ప్రశ్నించని ముద్రగడ పద్మనాభరెడ్డి... పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రశ్నిస్తారని ముద్రగడ కుమార్తె క్రాంతి. మొదటగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత... ప్రెస్ మీట్ పెట్టాలని చురకలాంటించారు.

శేష జీవితం ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా... తన కూతురు... సలహా ఇచ్చారు. మరొక సారి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే... అత్యంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తానే రంగంలోకి దిగి ప్రతిఘటిస్తానని హెచ్చరించారు. తన పేరు మార్చుకున్నాక కాపుల విషయం ఆయనకు ఎందుకు ? అంటే సోషల్ మీడియా వేదికగా ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రశ్నించారు. కాగా నిన్న... ముద్రగడ పద్మనాభ రెడ్డి... పవన్ కళ్యాణ్ ఉద్దేశించి.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమార్తె తాజాగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: