ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన మరుక్షణమే... జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉందంటూ.. ఆరోపణలు చేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత ఋషికొండ పై విలాసవంతమైన ప్యాలస్ ను జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం నిర్మించుకున్నాడని.. టిడిపి ఆరోపణలు చేస్తుంది.


దాదాపు 450 కోట్లు ఈ భవనాల కోసం జగన్ ఖర్చు చేశాడని ఫైర్ అవుతోంది.  అటు వైసి పి నేతలను లాక్కునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి కి ఊహించని షాక్ తగిలింది. వైయస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి... అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కి చెందిన టీవీ ఛానళ్లు అలాగే సోషల్ మీడియాలో కూడా... ఇదే ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వనిత, వైయస్ షర్మిల, సునీత రెడ్డి  ఇలాంటి చాలామంది మహిళలపై... వైయస్ భారతి సహాయకుడు రవీందర్ రెడ్డి... అనుచిత పోస్టులు పెట్టినట్లు... సమాచారం అందుతుంది. పోస్టులు పెట్టడమే కాకుండా వారిని ఉద్దేశించి అనేక రకాల... అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడట. సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు కూడా పెట్టేవాడట.


ఫోటోలు మార్ఫింగ్ చేసి మరి...  రచ్చ చేసేవాడని ఎల్లో మీడియా ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా  అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో... వైయస్ భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతుంది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: