ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూటమిలో భాగంగా టిడిపి నేతలు, జనసేన నేతలు  వైసిపి పార్టీ పైన విజయం సాధించడంతో ధర్మం గెలిచింది సత్యం గెలిచింది అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 174 ఎమ్మెల్యేలతో  ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ క్రమంలోనే సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.


ప్రోటెం స్పీకర్ సమక్షంలో బాలయ్య మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడంతో అటు అభిమానులు కార్యకర్తల సైతం చాలా ఆనంద పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె బ్రాహ్మణి ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్టుని సైతం షేర్ చేసింది.. ముఖ్యంగా నాన్న నువ్వు ఎప్పుడు ప్రజల లో హీరోవి నిరంతరం ప్రజల గుండెల్లోనే ఉంటావు వారి యొక్క సంతోషం లో నువ్వు కూడా ఒక భాగమే అందుకు తగ్గట్టుగానే శ్రమిస్తూ ఉంటావు ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ నారా బ్రాహ్మణి ఒక ట్విట్ చేసింది.హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్  విజయాన్ని సైతం అందుకున్నారు. అలాగే తన భర్త నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది.. దీంతో అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ నారా లోకేష్ తెలియజేసింది. రాష్ట్రంలో ఒక స్వర్ణ శంఖం మొదలయ్యింది అని రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుంది అంటు నారా బ్రాహ్మణి తెలిపింది. ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తన మామయ్యకు కూడా నార బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం నారా బ్రాహ్మణి చేసినటువంటి ఈ ట్విట్ అటు టిడిపి నేతలు నందమూరి అభిమానులు ఆనందాన్ని నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: