వైయస్ షర్మిల కు ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు... వైయస్ షర్మిల కు వ్యతిరేకంగా  పోరాటానికి దిగారు. వైయస్ షర్మిలను పార్టీ నుంచి తీసివేయాలని... ఏపీ కాంగ్రెస్ నేతలు... అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవడానికి కారణం వైఎస్ షర్మిల అంటూ... విమర్శలు చేశారు. తెలంగాణ వైసీపీ పార్టీని... కాంగ్రెస్ లో విలీనం చేసారు షర్మిల.
 

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా  వైయస్ షర్మిల నియామకమయ్యారు. షర్మిల అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ పార్టీ... ఎన్నికలకు కూడా వెళ్ళింది. అయితే... ఎన్నికల్లో వైయస్ షర్మిల ఓడిపోవడమే కాకుండా... పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆరు శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్ పర్సంటేజ్ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం షర్మిల అంటూ... ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు... సుంకర పద్మశ్రీ అలాగే రాకేష్ రెడ్డిలు... ఫైర్ అయ్యారు.అంతేకాదు షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఏపీ ఎన్నికల్లో... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా లేదని... వైయస్ షర్మిల కు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారని వారు ఫైర్ అయ్యారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసినప్పుడు... తమకు ఆమెపై చాలా నమ్మకం ఉండేదని... సుంకర పద్మశ్రీ వెల్లడించారు.కానీ ఆ పదవిని చేపట్టిన తర్వాత సొంత నిర్ణయాలు తీసుకుంటూ...  కాంగ్రెస్ వాటికి తీవ్ర స్థాయిలో నష్టం చేసిందని షర్మిలపై ఆగ్రహించారు. వైయస్ షర్మిల కు అసలు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదని... దానివల్ల పార్టీ లీడర్, నిరాశ నిస్పృహలకు... గురైందని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన షర్మిల అనుచరులు.... ఏపీ కాంగ్రెస్ లో వేలు పెడుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: