•  ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

* ప్రమాణ స్వీకారం చేసి పారిపోయిన జగన్

* సమావేశాలకు డుమ్మా కొట్టుతున్నారు కానీ

( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటమి రాజకీయాలలో ప్రతి ఒక్కరికీ గుణపాఠం అయిందని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో జగన్ చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చాయని చాలా చులకన చేసి మాట్లాడేవారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా చంద్రబాబును ఒక ఆట ఆడుకుంటూ చిరునవ్వులు చిందించేవారు. అధికారంలో ఉన్నప్పుడు అలా ప్రజాస్వామ్యానికి, అసెంబ్లీకి విలువ లేకుండా చేశారు. ఇప్పుడేమో అసెంబ్లీకి పూర్తిగా డుమ్మా కొట్టేస్తున్నారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న అసెంబ్లీకి హాజరయ్యారు. దానికంటే ముందు ఐదు నిమిషాలు లాస్ట్ బెంచ్ లోకి కూర్చున్నారు. తర్వాత ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆయన పులివెందులలో పర్యటించనున్నారని తెలిసింది.మూడు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలకు ఆయన దూరం కానున్నారు. నిజానికి జగన్ తో పాటు కలిసి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో కనీసం ఐదారుగురు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. వారితో కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయన కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామని బాబు మాటిచ్చారు.

కానీ ఇప్పటికీ ఫ్రీ బస్, ఫ్రీ సిలిండర్స్‌, నిరుద్యోగ భృతి వంటి వాటి గురించి ఏమీ మాట్లాడలేదు. అమరావతి పోలవరం ప్రాజెక్టు అంటూ తిరుగుతున్నారు తప్ప సూపర్ సిక్స్ గ్యారెంటీ ల గురించి మాట్లాడట్లేదు ఈ విషయాన్ని జగన్ హైలెట్ చేసి ఉంటే బాగుండేది. ఓడిపోయినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు కానీ జగన్ మాత్రం మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా ఇబ్బందిగా అసెంబ్లీలో కనిపించారు. తన పరిపాలన పట్ల తనకు సంతృప్తి ఉండి ఉంటే అలా డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. పోయినసారి చంద్రబాబు ఓడిపోయిన సరే అసెంబ్లీలోకి వచ్చి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. కొంతమంది వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన అసెంబ్లీకి రాకుండా మానేశారు.

జగన్ మాత్రం చంద్రబాబు లాగా ధైర్యం, ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటున్నారు ఆయన ఒకవేళ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రజల పక్షాన బాగా మాట్లాడినట్లయితే హీరో అయిపోతారు. మళ్లీ ఏపీలో గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన మర్చిపోవాల్సింది తన ఓటమి, హైలెట్ చేయాల్సినవి టీడీపీ కూటమి లోపాలను!

మరింత సమాచారం తెలుసుకోండి: