డయేరియా వ్యాధిపై బీజేపీ నేత, ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చాలా సీరియస్ గా స్పందించారు. శుక్రవారం నాడు అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో ఈ వ్యాధి గురించిన వివరాలను ఆయన సమీక్షించారు. ఇందులో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ వంటి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సంబంధిత ఉద్యోగులకు సత్య కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 271 వాటర్ సోర్సులు ఉన్నట్లు కూడా గుర్తించామని, లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతున్నట్లు తెలుసుకుందామని అధికారులు వెల్లడించారు.

అయితే నీటి కలుషిత ప్రాంతాలలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్య కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖలతో ఆరోగ్య శాఖ అధికారులు కలిసి ప్రజల కోసం పనిచేయాలని కూడా పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలకు ఎవరూ కూడా డయేరియా వ్యాధితో బాధపడకూడదు అని, అందుకు తగినట్లే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే సత్య కుమార్ యాదవ్ మంత్రి అవ్వగానే రాష్ట్రంలో చాలామంది ప్రజలను వేధిస్తున్న డయేరియాపై సీరియస్ గా స్పందించడం విశేషం. ఈ మంచి పని చేయడం వల్ల ఆయన పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా సత్య కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ప్రమాణం చేశారు. రాష్ట్రంలో ఈ మంత్రిత్వ శాఖ చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో సత్య కుమార్ యాదవ్ ఒకరు. బీజేపీ పార్టీ కూటమి విజయానికి తోడ్పడింది తక్కువే అయినా చంద్రబాబు మాత్రం అత్యంత కీలకమైన హెల్త్ మినిస్ట్రీ బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్‌కు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అయితే తనకు ఇచ్చిన ఆ మంచి పదవిని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: