•ఏపీ అసెంబ్లీ అంటేనే తిట్ల సభ


•ఈసారైనా అలాంటి చెడ్డ పేరు పోవాలి


•ప్రజా సమస్యలపై చర్చలు జరగాలి


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ్యుల ప్రమాణాలు కూడా జరిగాయి. ఇక నుంచి అసలు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వేరయ్యి విడిపోయాక.. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అనేది నానాటికీ కూడా తీసికట్టుగా ఉంటోంది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందువల్ల అసెంబ్లీ అంటే అదేదో బూతుల యుద్ధాలు, ఇంకా పనికిమాలిన సవాళ్లకు వేదికగా మారుతోంది. అసలు అసెంబ్లీ అంటే ఏంటి అన్న సంగతి రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలపై చర్చించే వేదిక. కాబట్టి వాటి గురించి మాత్రమే చర్చించాలి. కేవలం ప్రజలకు అవసరమైన పనుల గురించే మాట్లాడుకోవాలి. ప్రజల కోసం చేసే పనుల్లో మంచి చెడ్డల గురించి చర్చ జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించి.. వాటికి పరిష్కార మార్గాలు చర్చించి వాటిని అమలు జరిగేలా చేయాలి. ప్రతి పక్ష నాయకులు అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి.. వాటిని ఖచ్చితంగా సవరించేలా చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పుడు చూసినా విమర్శలు, బూతులు, సవాళ్లు, మాటల యుద్ధాలు తప్ప.. నిర్మాణాత్మకంగా చర్చ జరగదు.


అయితే అసెంబ్లీ విషయంలో మాత్రం పక్క రాష్ట్రాలు కొంత వరకూ బెటర్‌గా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా రాజకీయ సవాళ్లనేవి ఉన్నా.. చాలా వరకు చర్చలనేవి అర్థవంతంగా జరుగుతాయి. అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుతుంటే సభ అనేది సజావుగా సాగుతుంది. ఎవరి అభిప్రాయం వారు రాజకీయంగా వినిపిస్తారు. పర్సనల్ అటాక్  చెయ్యరు.కానీ.. ఇలాంటి దృశ్యాలు ఏపీ అసెంబ్లీలో మాత్రం జరగట్లేదు.ఎన్నో చట్టాలనేవి కనీస చర్చ కూడా జరగకుండానే ఆమోదం పొందుతుంటాయి. ఆ తర్వాత అదే చట్టాల అమలు సమయంలో మళ్లీ రచ్చ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో బూతుల వర్షం మాములుగా పడదు. ప్రతి ఒక్కరిని జనాలు చూస్తున్నారు. బూతు మాట మాట్లాడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో వైసీపీ విషయంలో అర్ధం అయ్యింది. అందుకే కనీసం 20 సీట్లు కూడా రాలేదు. కాబట్టి వైసీపీని ఉదాహరణగా తీసుకొని మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్ లో బ్లాస్ట్ అవ్వడం ఖాయం.ఇక ఈసారి వైసీపీ సభ్యులు కేవలం 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. కాబట్టి గత తప్పులని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచైనా ప్రజా సమస్యలపై గొంతు విప్పి పోయిన తమ పరువుని నిలబెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: