- కూల్చివేత‌ల‌తో బాబు పాల‌న ప్రారంభం
- విజ్ఞుడైన చంద్ర‌బాబు నుంచి ఊహించ‌ని ప‌రిణామం
- జ‌గ‌న్‌ది విధ్వంస పాల‌నైతే మ‌రి బాబోరిది..?

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఇదొక దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌. ఎందుకంటే.. విజ్ఞుడైన చంద్ర‌బాబు.. సుదీర్ఘ పాల‌నానుభ‌వం సొంతం చేసు కున్న చంద్ర‌బాబు కూడా.. త‌న పాల‌న‌ను కూల్చివేత‌ల‌తోనే ప్రారంభించారు. గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మం త్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. ఖ‌చ్చితంగా 10వ రోజు కృష్ణాన‌ది ఒడ్డున చంద్ర‌బాబు నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు. అనుమ‌తులు లేకుండా.. అక్ర‌మంగా నిర్మించారంటూ.. అప్ప‌ట్లో ఆయ‌న ఈ ప‌నిచేశారు. ఇది రాజ‌కీయంగా వివాదం సృష్టించింది.


ఆ ఘ‌ట‌నే జ‌గ‌న్‌పై విధ్వంస పాల‌న‌ అనే ముద్ర వేసేలా చేసింది. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌బుత్వం కూడా.. ఖ‌చ్చితంగా అదే రోజు అంటే.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన 10వ రోజు (ఈ నెల 12న ప్ర‌మా ణం చేశారు)  వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని అక్ర‌మ నిర్మాణం అంటూ కూల్చివేయించారు. అంటే.. చంద్ర బాబు కూడా.. త‌న పాల‌న‌ను కూల్చివేత‌ల‌తోనే ప్రారంభించ‌న‌ట్టు అయింది. మ‌రి  ఈ ఇద్ద‌రు(ఒక‌రు మాజీ) ముఖ్య‌మంత్రులు ఎలాంటి సందేశం ఇస్తున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.


చంద్ర‌బాబు చేశారా?  లేక‌.. ఆయ‌న మంత్రివ‌ర్గంలోని ఒక‌రు నిర్ణ‌యం తీసుకున్నారా?  అస‌లు చంద్ర‌బా బు ఈ విష‌యం తెలుసా?  లేదా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు రాదు. ఆయ‌న హ‌యాంలో ఏం జ‌రిగినా.. అది చంద్ర‌బాబు చేసిన‌ట్టే. అలానే ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని కూల్చివేసిన ఘ‌ట‌న కు చంద్ర‌బాబే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. అది అక్ర‌మ నిర్మాణ‌మే అయినా.. ఆయ‌న‌వివ‌ర‌ణ కోరాల్సింది. లేదా.. అసెంబ్లీలోనే చ‌ర్చించాల్సింది. కానీ, అలా చేయ‌కుండా రాత్రికి రాత్రి నిర్మాణం కూల్చివేత‌కు ఆదేశాలు ఇవ్వ‌డం..చంద్ర‌బాబు సీనియార్టీకి మ‌చ్చ‌గానే భావించాల్సి ఉంటుంది.


ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా రాష్ట్రంలో రాజ‌కీయంగా ఎలాంటి సందేశాలు ఇస్తున్నారన్న‌ది ప్ర‌ధాన అంశం. అంతేకాదు.. రాజ‌కీయంగా ఉద్రిక్త‌త‌లు పెంచి.. వాటిని పెంచి పోషిస్తే.. అంతిమంగా .. పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఇబ్బందులకు గుర‌వుతారు. వారు.. వీరు అనే తేడా లేకుండా.. అంద‌రూ కూడా.. ఇబ్బందుల బాటే ప‌ట్టాల్సి ఉంటుంది. చంద్ర‌బాబు వ‌చ్చారు. అంతా బాగుంటుంద‌ని అనుకుని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. పార్టీ కార్యాల‌యాన్ని కూల్చేయ‌డం.. స‌మంజ‌సం కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: