- 2014లో టీడీపీ... 2019లో వైసీపీ ఇలా చేసే ప‌త‌న‌మ‌య్యాయ్‌
- ఏపీ శాస‌న‌సభ అయ్య‌దేవ‌ర‌ను గుర్తు చేసుకుంటే మంచిది

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో అసెంబ్లీలో స‌భ్యులు స్ఫూర్తిని కోల్పోతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ ఒక‌ప్పుడు.. దేశం మొత్తానికి స్ఫూర్తిని ఇచ్చింది. అప్ప‌ట్లో స్పీక‌ర్‌గా ఉన్న అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు.. చాలా విజ్ఞ‌త‌తో వ్య‌వ హ‌రించారు. అధ్య‌క్షా వారిని స‌స్పెండు చేయండి అని ప్ర‌భుత్వ ప‌క్ష‌మే కోరినా.. ఆయ‌న ఒప్పుకొనేవా రు కాదు. స‌స్పెండ్ చేసుకుంటూ పోతే.. మీరు నేను మాత్ర‌మే మిగులుతాం. వారు మాట్లాడేదివారిని మాట్లాడ‌నివ్వండి!  అని స‌ర్దిచెప్పేవారు. ఆ స్ఫూర్తి అప్ప‌ట్లో పార్ల‌మెంటు వ‌ర‌కు చేరింది.


అంతేకాదు.. స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డం అంటే.. స‌ర్కారు సిగ్గుచేటుగా భావించేది. త‌మ త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకుంటున్నామ‌న్న భావ‌న‌తో ఉండేది. కానీ, రాను రాను..  ఈ ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌తిప‌క్షా లు నోరు విప్పితే.. స‌స్పెండ్ చేస్తున్న స‌భ‌లు పెరుగుతున్నాయి దీనివ‌ల్ల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వెలుగు చూడ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.. స‌భ్యులు దారి త‌ప్పుతున్నార‌న్న మాట వాస్త‌వం.  ఎవ‌రు అధికారంలో ఉంటే.. వారు తామే గొప్ప‌ని భావిస్తున్నారు.


ప్ర‌తిప‌క్షం అంటే.. ఎందుకూ ప‌నికిరాద‌న్న‌ట్టుగా అధికార ప‌క్షం స‌భ్యులు చూస్తున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాన్ని రెచ్చ‌గొట్ట‌డం.. వెకిలి చేష్ట‌ల‌కు దిగ‌డం.. 2014లోనే ప్రారంభ‌మైంది. త‌మ్ముడు.. త‌మ్ముడు.. ఇటు చూడు.. ఈ నెంబ‌రు మందేగా! అంటూ.. సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌ను స‌భ‌లోనే గేలి చేసే ప్ర‌య‌త్నం చేశారు. బుచ్చ‌య్య చెప్పాల‌నుకున్న‌ది..  జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌కు కేటాయించిన ఖైదీ నెంబ‌రు! మ‌రి దీనిని రెచ్చ‌గొట్ట‌డం అన‌రా ?


ఇక‌, విజ‌య‌వాడ‌కు చెందిన బొండా ఉమా.. అప్ప‌ట్లో వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. న‌రికేస్తా.. నా కొడ‌కా! అంటూ.. వైసీపీ ఎమ్మెల్యేపై ప‌రుష ప‌ద‌జాలం ప్ర‌యోగించారు. వ‌స్తోందండీ.. జంబ‌లకిడి పం బ‌ అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎంట్రీ అవుతున్న స‌మ‌యంలో టీడీపీ మ‌హిళా నాయ‌కురా లు(పేరు చెబితే బాగుండ‌దు) చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అనంత‌ర కాలంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. కూడా ఇలానే చేసింది. ఫ‌లితంగా.. స‌భ‌లు ప్ర‌తిప‌క్షం లేకుండానే సాగే ప‌రిస్థితి వ‌చ్చింది.


ఇప్పుడు చెప్పేది..?
ఇప్పుడు ఎలానూ ప్ర‌తిప‌క్షం లేదు. ఉన్న ప‌ది మందినైనా గేలిచేయ‌కుండా.. విమ‌ర్శ‌లు చేయ‌కుండా..అ వ‌మానించ‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తే.. స‌భ‌కు కొంతైనా గౌర‌వం ద‌క్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: