వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా రాలేదు. అనే మాట చాలా మంది అంటున్నారు. అంతేకాదు.. కొందరు కేబినెట్ హోదా కూడా ద‌క్క‌లేదు.. అని చెబుతున్నారు. అయితే..వాస్త‌వానికి చ‌ట్ట స‌భల ప‌రిభాష‌లో హోదా అనే మాట లేదు. ప్ర‌తిప‌క్షం అనే మాటే ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌మ‌నిస్తే.. 2019-2024 మ‌ధ్య కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు భారీ మెజారిటీ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్‌కు ఎలాంటి హోదా లేదు.(వీరు చెప్పిన‌ట్టు)


కానీ, చ‌ట్ట‌స‌భ‌ల్లో మాట్లాడే అవ‌కాశం రాలేదా?   లేక‌.. చ‌ట్ట‌స‌భ‌ల్లో మైకు ఇవ్వ‌లేదా? అంటే.. అన్ని బాగానే జ‌రిగాయి. కాక‌పోతే.. సంఖ్యా బ‌లం లేన‌ప్పుడు.. చ‌ట్ట‌స‌భ‌ల్లో అధికార ప‌క్షం స‌భ్యులు ఎక్కువ మంది ఉన్న ప్ప‌డు.. గేలి చేయ‌డం.. అవ‌హేళ‌న‌గా మాట్లాడ‌డం.. అరుపులు, కేకలు పెట్ట‌డం వంటివి మాత్ర‌మే క‌నిపిస్తా యి.  ఇక‌, తెలంగాణ‌లోనూ 2018-2023 మ‌ధ్య చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నే లేదు. కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ ని బీఆర్ ఎస్‌లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏమీ కుంగిపోలేదు.


ఒకానొక ద‌శ‌లో స‌భ‌లో ఇద్ద‌రు స‌భ్యులు మాత్ర‌మే కాంగ్రెస్కు ఉన్నారు. అయినా బ‌ల‌మైన గ‌ళం వినిపించ డంతో మైకును పొందారు. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించారు. ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌వారికి ఎలాంటి మ‌ర్యాదలు అం దుతాయో.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్నా అంతే!  కాక‌పోతే.. రెండు కార్లు ఇచ్చే చోట ఒక కారును మాత్ర‌మే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది. భ‌ద్ర‌త విష‌యంలో ఎలాంటి తేడా ఉండ‌దు. వ్య‌క్తుల‌ను బ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. అంటే.. వ్య‌క్త‌లు ప్రాణాల‌కు ఉన్న ఇబ్బందినిగుర్తించి భ‌ద్ర‌త క‌ల్పిస్తారు.


ఉదాహ‌ర‌ణ‌కు చంద్ర‌బాబుకు.. గ‌త ఏడాది జెడ్‌+  కేటగిరీ భ‌ద్ర‌త‌తో పాటు బ్లాక్ క‌మెండోల సంఖ్య‌ను పెం చారు. దీనికి కార‌ణం ఆయ‌న అధికారంలో ఉన్నార‌ని కాదు.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఉన్న భ‌యాలు. ఇబ్బందులు. ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. వ్యక్తిగ‌తంగా ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తా రు. పార్టీ ఇంకా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరినా.. క‌ల్పిస్తారు. లేక పోతే.. కోర్టుల‌కు వెళ్లే స‌దుపాయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: