సాధార‌ణంగా ప్ర‌జ‌ల నుంచి ఎన్నికైన వారు చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగు పెట్టిన‌ప్పుడు.. ప్ర‌మాణం చేస్తారు. దీనిని గ‌వ‌ర్న‌ర్ చేయిస్తారు. అయితే.. గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌రితోనూ ప్ర‌మాణం చేయించే అవ‌కాశం  ఉండ‌దు కాబ‌ట్టి.. ముందుగా.. ఒక‌రితో ప్ర‌మాణం చేయించి.. త‌ర్వాత‌.. ఆయ‌న ద్వారా..(గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌త్యామ్నా యం) మిగిలిన స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయిస్తారు. ఇది.. స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌పార్ల‌మెంటు నుంచి పంచాయ‌తీ వ‌ర‌కు ఇదే విధానంలో స‌భ్యులు ప్రమానం చేస్తారు.


............అనే నేను అని ప్రారంభ‌మ‌య్యే ఈ ప్ర‌మాణం ఎందుకు?  దీని వెనుక ఉన్న రీజ‌నేంటి?  అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఈ విష‌యం ప‌క్క‌న పెట్టి.. మ‌నం మ‌రికొన్ని రంగాల‌ను ప‌రిశీలిస్తే.. అక్క‌డ కూడా.. ప్ర‌మాణం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు వైద్యులు.. లాయ‌ర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు ఇలాంటి వారంతా కూడా.. ప్ర‌మాణం చేస్తారు. ఆ త‌ర్వాత‌.. వారికి స‌ర్టిఫికెట్లు ఇస్తారు. దీనికి కార‌ణం చూస్తే.. ఒక్క వైద్య రంగాన్ని ప‌క్కన పెడితే.. ఇత‌రుల విష‌యం మాత్రం రాజ్యాంగానికి ముడిప‌డి ఉండ‌డ‌మే.


రాష్ట్రాల్లో ప‌నిచేసే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వులు అనే విష‌యం చాలా మందికి తెలి యదు. వీరు నేరుగా రాష్ట్ర‌ప‌తి ద్వారా నియ‌మితుల‌వుతారు. అలానే.. న్యాయ‌వాదులు కూడా.. స్వ‌యం వృత్తిలో ఉన్నా.. రాజ్యాంగానికి బద్ధుల‌మై పనిచేస్తామ‌ని ప్ర‌మాణం చేస్తారు.  దీనికి కార‌ణం.. వీరంతా రాజ్యాంగం ప‌రిధిలో రాజ్యాంగానికి లోబ‌డి.. చ‌ట్టాల‌కు అనుకూలంగా ప‌నిచేయాల్సి ఉండ‌డ‌మే. సో.. రాజ్యాంగంలోనూ.. చ‌ట్టంతోనూ సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ.. ప్ర‌మాణం చేయాలి.


ఇక‌, స‌భ‌ల్లో చ‌ట్టాలు చేసే అధికారం పొందిన స‌భ్యులకు ఈ విష‌యంలో మ‌రింత ఎక్కువ బాధ్య‌త ఉం టుంది. అందుకే.. దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు, అసెంబ్లీలు, మండ‌లిలు.. పంచాయ‌తీలు ఇలా ఏవి తీసుకున్నా.. చ‌ట్ట స‌భ‌ల స‌భ్యులు అంద‌రూ.. అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌నే సంబంధం లేకుండా.. తాము రాజ్యాంగానికి క‌ట్టుబ‌డి ప‌నిచేస్తామంటూ.. ప్ర‌మాణం చేయ‌డం ఆన‌వాయితీ. చిత్రం ఏంటంటే.. చ‌ట్ట స‌భ‌ల స‌భ్యులు ఈ ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌. సంత‌కం చేస్తేనే వారు స‌భ్యులుగా గుర్తింపు పొందుతారు. ఈ ప్ర‌మాణం చేయ‌క‌పోతే.. ఆయా స‌భ్యుల ఎన్నిక ఆరు మాసాల్లోనే ర‌ద్ద‌వుతుంది. అందుకే.. త‌న‌కు ఇష్టం ఉన్నా.. లేకున్నా.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ఒంట‌రిగా వ‌చ్చి ప్ర‌మాణం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: