( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

ముఖ్య‌మంత్రి పీఠ‌మే ప‌ర‌మావ‌ధా?  పార్టీల నేత‌ల‌కు ప్ర‌జాతీర్పుతో సంబంధం లేదా?  వారు ఇచ్చిన తీర్పును సైతం నాయ‌కులు కాల రాస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వ‌స్తోంది. ప్ర‌జ‌లు విజ్ఞులు. వారు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రిని గ‌ద్దె నెక్కించాలో.. ఎవ‌రిని ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టాలో తీర్పు ఇస్తారు. ఈ తీర్పును ఎంతటి పార్టీ అయినా.. ఎంత‌టి నాయ‌కుడైనా పాటించాల్సిందే. ఈ విష‌యంలో తిరుగులేదు. అయితే.. నాయ‌కులు.. మాత్రం ప‌దవుల కోస‌మే పాటుప‌డుతున్నారు.


వాస్త‌వానికి సంఖ్యాబలంతో సంబంధం లేకుండా.. గ‌తంలో ఎంతో మంది ప్ర‌తిప‌క్ష నాయకులుగా ప‌నిచేశా రు. కేవ‌లం ఒక్క‌రే ఉన్న సమ‌యంలోనూ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించి న పార్టీలు ఉన్నాయి. లోక్‌స‌త్తా పార్టీ నుంచి ఒక్క‌రే ఎన్నికైన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌జ‌ల స‌మ స్య‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించారు. ఈయ‌న‌కు ముందు కూడా.. క‌మ్యూనిస్టుల త‌ర‌ఫున ఎన్నికైన నాయ‌కులు కూడా.. స‌భ‌లో త‌మ పాత్ర‌ను త‌గ్గించుకోలేదు.


కానీ, 2014 నుంచి ఈ ప‌ద్ధ‌తి నుంచి మారిపోయింది. అప్ప‌ట్లో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌భ‌ను బాయ్‌కాట్ చేశారు. ముఖ్య‌మంత్రిగానే స‌భ‌కు వ‌స్తాన‌ని ఆయ‌న చెప్పారు. అనం త‌రంప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. పాద‌యాత్ర చేశారు. 2019లో అధికారంలోకి వ‌చ్చారు. ఈ మ‌ధ్య కాలంలో స‌భ‌లో వైసీపీ నాయ‌కులు క‌నిపించ‌లేదు. పైగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు. స‌భ‌లో అధికార ప‌క్ష‌మే.. ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింది.


ఇక‌, 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ కూడా.. ఇదే ప‌నిచేసింది. 2022లో చంద్ర‌బాబు కూడా.. త‌న‌ను గేలి చేశారంటూ.. ఆయ‌న కూడా స‌భ‌ను బాయ్ కాట్ చేశారు. తాను కూడా.. సీఎం అయిన త‌ర్వాతే స‌భ లోకి వ‌స్తాన‌న్నారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న తాజాగా స‌భ‌లోనే అడుగు పెట్టారు. అయితే.. ఇత‌ర నాయ‌కుల‌ను మాత్రంస‌భ‌కు పంపించారు. అయిన‌ప్ప‌టికీ.. వివాదాలు.. ర‌గ‌డ‌తోనే.. స‌భ‌లు సాగాయి. ఎలా చూసుకున్నా... నాడు వైసీపీ.. త‌ర్వాత టీడీపీకూడా..కేవ‌లం సీఎం ప‌ద‌వి ద‌క్కితేనే స‌భ‌లోకి అడుగులు వేస్తామ‌ని చెప్ప‌డం స‌భ‌కు వ‌న్నె తేలేదని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: