- బ‌లం ఉంద‌ని ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలొద్దు
- అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు త‌ప్ప‌నిస‌రి

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ప్ర‌స్తుతం ఏర్ప‌డిన స‌భ‌లో ప్ర‌తిప‌క్షం లేన‌ట్టే. కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే వైసీపీకి ద‌క్కాయి. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాతోపాటు.. ప్ర‌తిప‌క్షం హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ నాయ కులు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇక‌, ఇప్పుడు స‌భ‌లో ఎటు చూసినా 164 మంది టీడీపీ, జ‌న‌సేన‌, బీజే పీ నాయ‌కులు మాత్ర‌మే క‌నిపిస్తారు. ఈ నేప‌థ్యంలో సంప్ర‌దాయాల‌ను కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌తిప‌క్షం లేక‌పోయినా.. ఆ పార్టీ నేత‌ల‌ను గేలిచేయ‌డం మానుకోవాలి.


అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు స‌భ అర్ధ‌వంతంగా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అదే స‌మ‌యంలో ఒంటెత్తు పోక‌డ‌ల‌తో నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌య‌త్నం కూడా మానుకోవాలి. కొన్ని కీల‌క విష‌యాల‌పై ప్ర‌తి ప‌క్షం స్పందించే అవ‌కాశం లేక‌పోయినా.. ఇప్పుడు స‌భ‌లో ఉన్న‌వారే.. ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌ళం వినిపించాల్సి ఉంటుంది. అంతేత‌ప్ప‌.. బ‌లం ఉంది క‌దా.. అని ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలుతీసుకుంటే.. అది అధికార ప‌క్షానికే ఇబ్బంది వ‌స్తుంది.


ఇక‌, స‌భ్యులు కూడా అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌కు ముందుకు రావాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఎక్కువ మంది స‌భ్యులు కొత్త‌గా ఎన్నికైన వారు ఉన్నారు. వారు స‌బ్జెక్టును ఎంచుకునే ముందు.. సీనియ‌ర్ల‌ను సంప్ర‌దించ డం ద్వారా..వారి సందేహాలు తీరుతాయి. ఈ విష‌యంలో స‌భ్యులు ఆచి తూచి అడుగులు వేయాలి. ఇక‌, స‌భ‌లో ప్ర‌తిప‌క్షం ఉన్నా లేకున్నా.. స‌భ్య‌స‌మాజం స్వాగ‌తించేలా స‌భ‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో స్పీక‌ర్ స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది.


అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. స‌భ‌ను గౌర‌వ స‌భ‌గా మార్చేందుకు ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవా ల్సి ఉంటుంది. గ‌త స‌ర్కారు త‌ప్పులు ఎత్తి చూపుతున్నా.. గేలి చేసేలా కాకుండా.. వివాదాల‌కు తావులే కుండా.. స‌భా నాయ‌కుడిగా ఆయ‌న బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. అప్పుడే స‌భ గౌర‌వం.. నిజంగానే ఇనుమ‌డిస్తుంది. లేక‌పోతే.. స‌భ మ‌రోసారి వివాదంగానే మారుతుంది. ఇలా చేయ‌కుండా ఉండేలా.. చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: