కొడాలి నాని గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంత్రి పదవి పక్కనబెడితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనదైన భూతు పురాణంతో నాని మా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు ఆంధ్రాలో. ఇలా దాదాపు ఓ ముగ్గురు నలుగురు నాయకుల నోటి దూల మూలంగా నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుందని చెప్పుకోవచ్చు. ఆ విషయం పక్కనబెడితే తాజాగా టీడీపీ కూటమి నాయకుడు బుద్ధా వెంకన్న కొడాలి నానిపైన తనదైన రీతిలో విరుచుకు పడ్డాడు. మొదట అమరావతి జోలికి వెళ్లడం వల్లే జగన్‌ ఓటమిపాలయ్యారని మండిపడుతూనే కొడాలి నాని భూతు పురాణం వల్లనే జగన్ దుస్థితి నేడు ఇలా తయారయిందని విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో ఆయన కొడాలి నాని చేసిన పాపాలను గురించి మాట్లాడుతూ... గుడివాడ జనాలు చాలా కోపంగా ఉన్నారని, వీలైతే ఊరు వదిలి వెళ్ళిపోయి బతికిపొమ్మని కొడాలి నానికి సూచించారు. ఇక దాదాపు వైసీపీ ప్రభుత్వనికి నూకలు చెల్లినట్లేనని నాని వంటి మాజీ మంతులు తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడికైనా వలస పోతేనే వారికి పుట్టగతులు ఉంటాయి లేకపోతే ఉండనని దుయ్యబట్టారు. ఇకపోతే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా రద్దు చేస్తూ అసెంబ్లీలో పెట్టిన సంఘటనల గురించి మాట్లాడారు బుద్ధా వెంకన్న. ఇప్పుడు అదే శాసన మండలిలో‌ తనకు బలం ఉందని వైఎస్ జగన్ చిలక పలుకులు చెబుతుంటే చాలా కామెడీగా ఉందని, జనాలు ఇక మీ మాటలు వినే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.

గత 5 సంవత్సరాల పాటు జగన్ కళ్లు మూసుకుని పని చేశాడని, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే సమయం యిట్టె గడిచిపోయి మరలా తమ ప్రభుతం వస్తుందని పగటి కలలు కంటున్నాడని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఒకవేళ కళ్లు తెరిచి పని చేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా వారికి లభించేదని, ఇపుడు అదికూడా లేదని మాట్లాడారు. జగన్ అండ్ కో అలా నిర్లక్ష్యంగా పాలన చేయడం వల్లనే ప్రజలు వారికి 11 సీట్లకి పరిమితం చేశారని చెప్పారాయన. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులపై అకారణంగా అనేక కేసులు పెట్టి జగన్ ఇపుడు తనపైన ఉన్న కేసులకు సమాధానం చెప్పి తీరాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: