నందమూరి బాలకృష్ణకు వరాలు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బసవతారకం ఆస్పత్రికి ఎలాంటి ఢోకా ఉండదని.. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తాజాగా ప్రకటించారు సీఎం రేవంత్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు , డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరు అయ్యారు.


జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ....నందమూరి బాలకృష్ణ తిరిగి 25 వార్షికోత్సవం కు రావాలని కోరుతున్నారు.. 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తానని ప్రకటించారు.  ఆస్పత్రి లీజ్ వివాదాన్ని కేబినేట్ నిర్ణయం తీసుకుని పరిష్కరించాము....భవిష్యత్తు లో బసవతారకం ఆస్పత్రికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం ఆస్పత్రికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీగా… మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


ఆ విధంగా పనిచేయాలని మా అధికారులకు ఆదేశించామన్నారు. గతంలో 12 గంటలు పని చేస్తే చాలు అనుకునే వాడిని కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటలు పని చేసే వ్యక్తి అని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నాతో సహా మా అధికారులంతా అంతే ధీటుగా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలోనే ప్రగతి పదంలో ఉండాలని కోరుకుంటున్నానని... మూడోతరం నారా లోకేష్ , భరత్ రాజకీయాల్లో ఎలాంటి మార్క్ కనబరుస్తారో చూడాలన్నారు.

ఇక అటు సీఎం రేవంత్‌ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ ప్రసంశలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఆదర్శం అన్నారు. ఆంధ్ర లో బసవతారకం ఆస్పత్రి ప్రారంభించనున్నామని... ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు  నందమూరి బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: