భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్.. అనకాపల్లి నుంచి గెలిచారు. ఈయన కూడా చాలా పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని కూడా చెప్పవచ్చు.. జగన్ ని పులివెందులలోనే వివేకానంద రెడ్డిని ఊడగొట్టింది ఆయనే.. ఆరోజు బీటెక్ రవి విజయానికి కారణమయ్యింది ఈయనే.. అక్కడ ఎమ్మెల్సీ విజయానికి వెనుక నిలబడింది కూడా తనే. కడప జిల్లాలో జగన్ కు షర్మిల ద్వారా చెక్ పెట్టింది కూడా సీఎం రమేష్.. ఇప్పుడు ఆ సీఎం రమేష్ కీలకమైనటువంటి పాయింట్ తెలియజేశారు. ఆయన దాదాపుగా చెప్పింది చేసేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది..


భారతీయ జనతా పార్టీ అధినేతలతో కూడా మంచి పలుకుబడి ఉన్నది సీఎం రమేష్ కు. ప్రస్తుతం గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పార్టీ చేసిన పనుల పైన సిబిఐకి అప్పచెప్పుతామంటూ బిజెపి ఎంపీ అనకాపల్లి సీఎం రమేష్ తెలియజేశారు. శాసనసభకు వచ్చిన ఆయన శుక్రవారం రోజున విలేకరులతో మాట్లాడారు. అలాగే ఆయన ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఐదేళ్ల జగన్ పాలనలో ఇసుక, మద్యం, విద్యుత్ రంగాల మీద జరిగిన అవినీతి మీద కూడా విచారణ జరపాల్సింది అంటు వినతి పత్రాలను కూడా అందించారు.


విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పిపిఎల్ లు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు వంటి అంశాలలో భారీ కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు విచారణ పెట్టి ఆ విచారణ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత జగన్ పైన దర్యాప్తు చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది జగన్ ని ఇరకటం లో పెట్టేటువంటి ఎత్తుగడ అన్నట్టుగా కనిపిస్తోంది. సీఎం రమేష్ ఇటీవలే ఈ విషయాలన్నీ తెలియజేశారు. మరి ఇందులో సీఎం రమేష్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: