ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న మాట ఇదే. ఏ ఇద్ద‌రు క‌లిసినా... వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప క్ష హోదా కూడా ద‌క్క‌లేదు.. అని! తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లు 164 సీట్లు ద‌క్కించుకున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీ కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. దీంతో అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్క‌లేద‌న్న వాద‌న వైసీపీని చుట్టుముట్టింది. అయి తే.. రాజ్యాంగంలోని అంశాల‌ను ప‌రిశీలిస్తే.. అధికార ప‌క్షం-ప్ర‌తిప‌క్షం- అనే ఈ రెండు మాట‌లే ఉన్నాయి.


ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అనే మాటేలేదు. 1988 వ‌ర‌కు కూడా.. అస‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అనే మాటే వినిపిం చలేదు.  రాజ్యాంగంలో ఇప్ప‌టికీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అనేది లేదు. అయితే..ఆ త‌ర్వాత‌.. పార్టీలు పుట్ట‌గొ డుగులుగా పుట్ట‌డంతో పాటు ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం పెరిగింది. దీంతో చ‌ట్ట‌స‌భ‌ల్లో అనేక పార్టీల ప్ర‌తి నిధులు పెరుగుతూ వ‌చ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న అన్ని పార్టీల స‌భ్యుల్లోనూ.. ఎక్కువ మంది ఏ పార్టీకి ఉంటే.. ఆ పార్టీకి స‌భ‌లో ప్రాతినిధ్యం ద‌క్కుతుంది.


అంటే.. స‌భ‌లో ఎక్కువ స‌మ‌యం మాట్లాడే అవ‌కాశం ల‌భిస్తుంది. దీంతో అప్ప‌ట్లో పుట్టిన ప‌ద‌మే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అనే మాట‌. దీనివ‌ల్ల వ్య‌క్తుల‌కు కానీ.. పార్టీల‌కు కానీ.. ప్ర‌త్యేకంగా ఒరిగేది ఏమీలేదు. కేవ‌లం సంఖ్యా బ‌లం ఉన్న కార‌ణంగా.. అధికార ప‌క్షం ఇంకొంతం ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే లేక‌పోయినా.. స‌భ ల‌కు వెళ్లే ప్ర‌తిప‌క్ష స‌భ్యులకు గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోటు ఉండ‌దు.  వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాగం జ‌నార్ద‌న్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆయ‌న అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష స‌భ్యుడు.


స‌భ‌లోకి వ‌స్తున్న స‌మ‌యంలో స‌చివాల‌య సిబ్బంది ఆయ‌న‌ను అడ్డుకున్నారు. మీరు ప్ర‌తిప‌క్షంలో ఉ న్నారు. ఇటు వెళ్లేందుకు వీల్లేద‌ని అడ్డుకున్నారు. దీంతో నాగం నిజ‌మేన‌ని అనుకుని.. వెన‌క్కి త‌గ్గారు. త‌ర్వాత రెండు రోజుల‌కు ఈ విష‌యం సీఎంగా ఉన్న వైఎస్‌కు తెలిసింది.  వెంట‌నే ఆయ‌న సిబ్బందిని పిలిచి హెచ్చ‌రించ‌డంతోపాటు.. స్పీక‌ర్ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. దీనికి కార‌ణం.. స‌భ‌లో ఇద్ద‌రూ స‌మాన‌మే. రాజ‌కీయంగా మాత్ర‌మే వేరు. ఎవ‌రికి ఎలాంటి గౌర‌వ భంగం క‌లిగేందుకు ఆస్కారం ఇవ్వ‌రు. అందుకే.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులైనా.. అధికార ప‌క్ష స‌భ్యులైనా.. స‌భ‌లో శ్రీ అనే సంబోధిస్తారు. కాక‌పోతే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంటే.. కేబినెట్ హోదా ఇస్తారు. దీని వ‌ల్ల కూడా ఒరిగేది ఏమీ లేదు. కేవ‌లం చెప్పుకొనేందుకు మాత్ర‌మే ప‌రిమితం.

మరింత సమాచారం తెలుసుకోండి: