తెలంగాణాలో ప్రభుత్వ విధాన పరమైన అంశాల్లో పార్టీలో ముఖ్యమైన వారితో కనీసం చర్చ లేకుండా, ప్రభుత్వ ప్రతిపాదనలు అనేవి కూడా లేకుండా కొంతమంది నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పలు విధాల సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, ఇకనుండి తెలంగాణ ప్రభుత్వంలో ఏ మంత్రులు మాట్లాడినా అది అఫీషియల్ కానీ కాదు. కేవలం ఇద్దరే ఇద్దరు... పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు చెప్పేదే శాసనం, అధికారికం. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

ఇటీవలి కాలంలో చూసుకుంటే కొంతమంది సో కాల్డ్ కాంగ్రెస్ నేతలు సమన్వయం లేక మాట్లాడే మాటలకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పట్టు లేదని విపక్షాలు కోడై కూస్తున్నాయి. ఈ ప్రచారంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది సీనియర్ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇకనుండి వాటికి కాలం చెల్లింది అంటూ స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

సాధారణంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐ అండ్ పీఆర్ మినిస్టర్. ఆయన చెప్పేదే అధికారికం కావాలి. ఇక ఆయనకు తోడుగా శ్రీధర్ బాబును రేవంత్ సూచించాడు. వారు చెప్పేదే అధికారికం అని ఆయన నొక్కి వక్కాణించడం పార్టీలో పలువురు నేతలను ఆశ్చర్యానికి గురిచేసినట్టుగా సమాచారం. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు లేవనే చెప్పుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో ఆయన ముద్ర చూపించాల్సి నసమయం ఆసన్నం అయింది. సీనియర్లు కూడా చేత కాలేదు అని చెప్పడానికి ఇక అవకాశం లేదు. అందుకే మెల్లగా అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు.. అనవసర గందరగోళానికి తెరదింపేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: