ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు కూటమికి భారీ అనుకూలాన్ని తీసుకోవచ్చాయి. దీంతో కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలో భారీ విజయాలను అందుకున్నాయి. ఇటీవల సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అసెంబ్లీలో కూడా ఇటీవలే ప్రమాణస్వీకారాన్ని అందరు ఎమ్మెల్యేలతో చేయించడం జరిగింది. అయితే తాజాగా టిడిపి మహిళా నేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన నోరు జారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తిగా చూద్దాం.


రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సైతం నిన్నటి రోజు నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే టిడిపి మహిళ ఎమ్మెల్యే అయినా సింధూర రెడ్డి పొరపాటున లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడడం జరిగింది.వెంటనే ఈ తప్పు గ్రహించి ఆమె క్షమాపణలు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి స్వయాన కోడలు అవుతుంది. సత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా నిలబడి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె ఈ విషయం పైన కూడా క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తోంది.


అయితే కొన్ని సందర్భాలలో ఇలా మాట్లాడడం సర్వసాధారణంగా అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అటు టిడిపి నేతలు కూడా పెద్దగా చూపించలేదని లైట్గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో కూడా చంద్రబాబు నాయుడు పలు నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా మంత్రులు కూడా తమ తమ పనులను చేసుకునే విధంగా ఉండేలా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమకు అధికారం కట్టబెట్టిన ప్రజలకు అన్ని విధాల చూసుకునే విధంగా మంత్రులకు ఆదేశాలను జారీ చేశారు. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని కూడా కచ్చితంగా నెరవేరుస్తామనే విధంగా తెలియజేశారు. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మరెన్ని చూడాల చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: