ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్నికల ఫలితాలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. కూటమితో జత కట్టిన టిడిపి కూడా అధికారం చేపట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు అయ్యారు..  జనసేన నేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు మరిన్ని శాఖలు కూడా ఇచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో లేదో అప్పుడే వైసిపి నేతల పైన కార్యకర్తల పైన కార్యాలయాల పైన కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. నిన్నటి రోజున తాడేపల్లి లో ఉండే వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని సైతం కూల్చివేయడం జరిగింది.


అనుమతులు లేకుండా ఈ కార్యాలయాలను నిర్మించారంటూ తెలియజేశారు.అయితే ఇప్పుడు తాజాగా రాయలసీమలోని  అనంతపురం హెచ్.ఎల్.సి కాలనీలో వైసీపీ కార్యాలయానికి సంబంధించి మున్సిపాలిటీ అధికారులు నోటీసులు సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏడు రోజులలోపు విచారణ ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విధంగా తెలియజేశారు. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేరుతో నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది మున్సిపాలిటీ అధికారులు.


తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయా భవనాన్ని సైతం కూల్చి వేయడమే కాకుండా విశాఖపట్టణం లో కూడా ఇదే సంఘటన జరిగింది ఇప్పుడు మళ్లీ అనంతపురం జిల్లాలోని పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడంతో ఒకసారిగా వైసీపీ పార్టీలో కలకలం రేపుతోంది. మరి ఏ మేరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలపైన స్పందిస్తారో చూడాలి మరి .అలాగే వైసిపి నేతలు కూడా ఇప్పుడిప్పుడే అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తలను హింసిస్తున్న నేపథ్యంలో చాలామంది వైసిపి కార్యకర్తలు మరణించారు. దీంతో వారందరిని పరామర్శించడానికి మళ్లీ అతన్ని మొదలు పెడతారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటికే వైసీపీ కార్యాలయాలను కూల్చివేత పైన కూడా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. టిడిపి పార్టీకి చురకలు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: