జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌లు చేతులు క‌లిపిన దృశ్యం .. చాలా ఆల‌స్యంగా వెలుగు చూసింది. అసెంబ్లీలో శుక్ర‌వారం స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా.. పులివెందుల అభ్య‌ర్థిగా త‌న ప్ర‌మాణం పూర్తి చేశారు. అయితే.. ఈ సమ‌యంలో అసెంబ్లీలో కెమెరాలు ఆయా దృశ్యాల‌ను చిత్రీక‌రించినా..  కొంత మేర‌కు మాత్ర‌మే బ‌య‌ట‌కు రిలీజ్ చేశాయి.


జ‌గ‌న్ న‌మ‌స్కారం పెడుతూ.. స‌భ‌లోకి రావ‌డం నుంచి ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం.. అనంతరం.. ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య‌ను ప‌ల‌క‌రించ‌డం.. గౌర‌వ న‌మ‌స్కారం చేయ‌డం వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌సారం చేసిన అసెంబ్లీ ఇన్ కెమెరాలు.. త‌ర్వాత‌.. దృశ్యాల‌ను చూపించ‌లేదు. ఇత‌ర నేత‌ల విష‌యంలో మాత్రం పూర్తిగా ప్ర‌సారం చేశాయి. జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం కొంత ఎడిటింగ్ క‌నిపించింది. బుచ్చ‌య్య కు న‌మ‌స్కారం చేసే వ‌ర‌కే ప్ర‌సారం చేసిన విష‌యం తెలిసిందే.


కానీ, త‌ర్వాత‌.. జ‌రిగిన ఆస‌క్తికర ఘ‌ట్టం తాజాగా వెలుగు చూసింది. నేరుగా జ‌గ‌న్ బుచ్చ‌య్య‌ను క‌లుసుకు న్నాక‌.. అసెంబ్లీ రికార్డుల్లో త‌న సంత‌కం చేశారు. అనంత‌రం.. వెళ్తూ వెళ్తూ.. జ‌న‌సేన అధినేత , డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ చేతుల్లో చేతులు వేసుకుని కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. ఇది ఒక‌ర‌కంగా ఆహ్లాద‌క‌ర విష‌య‌మే. రాజ‌కీయాల్లో ఎన్ని ఉన్నా.. సంప్ర‌దాయాలు.. స‌భ‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం.. ఇలా క‌లివిడిగా ఉండ‌డం ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి నిద‌ర్శ‌నం.


అయితే.. ఇది మున్ముందు కొన‌సాగుతుందా?  లేదా? అనేది చూడాలి. ఇదిలావుంటే.. ఎ న్నిక‌ల స‌మ‌యం లోను దీనికి ముందు కూడా.. ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. మూ డు పెళ్లిళ్లు అంటూ.. జ‌గ‌న్ విమ‌ర్శిస్తే.. నువ్వే నా నాలుగో పెళ్లాం.. అంటూ ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌ర్వాత‌కూడా.. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌క‌పోతే.. అంటూ ప‌వ‌న్ కూడా శ‌ప‌థాలు చేశారు. ఇలా.. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లతో.. నిప్పులు చెరుక్కున్నారు. కానీ, స‌భ‌లో మాత్రం సంప్ర‌దాయాలు పాటించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: