విశాఖ‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి .. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం విలాస‌వంత‌మైన భ‌వ‌నాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. త‌మ స‌ర్కారు మ‌రోసారి గెలుస్తుంద‌ని..సీఎంగా జ‌గ‌న్ రెండో సారి విశాఖ నుంచే పాల‌న చేస్తార‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే చెప్పారు. అయితే.. ప్ర‌జాతీర్పులో అంద‌రూ కొట్టుకుపోయారు. ఆ త‌ర్వాత‌..రుషికొండ‌లో ఏం జ‌రిగింద‌నేది వెలుగు చూసింది. అప్ప‌టి వ‌ర‌కు శ‌త్రుదుర్భేద్యంగా ఉన్న రుషికొండ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసింది.


అయితే.. ఇప్పుడు దీనిని ఏం చేయాల‌న్న విషయం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది. పైకి చెబుతున్న‌ట్టు రూ.500 కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్టు అనుకుంటున్నా.. లెక్క‌లు చూప‌ని సొమ్ము కూడా.. అక్క‌డికే త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ముందు ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చూస్తున్నారు. అస‌లు రుషికొండ‌కు ఎక్క‌డ నుంచి ఎంత సొమ్ము కేటాయించార‌నే విష‌యంపై ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. ఇది తేలిన త‌ర్వాత‌.. దీనిపై నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.


ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం రెండురూపాల్లో రుషికొండ‌ను వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు  ప్ర‌భు త్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిలో 1)  ఐటీసీ, లేదా.. తాజ్ మ‌హ‌ల్ వంటి బ‌హుళ ప్ర‌ఖ్యాతి చెందిన హోట‌ళ్ల‌కు రుషికొండ‌ను లీజుకు ఇవ్వ‌డం. తద్వారా వ‌చ్చే నిధుల‌ను ప్ర‌బుత్వ అవ‌స‌రాల‌కు మ‌ళ్లించ డం. ఇది చేసేందుకు కొన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి న్యాయ సంబంధ‌మైన అంశాలు కూడా.. అడ్డంకిగా మారాయి.


ప్ర‌స్తుతం రుషికొండ నిర్మాణం వ్య‌వ‌హారం.. సుప్రీంకోర్టులో ఉంది. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌ణంగా పెట్టి నిర్మించా రంటూ.. గ‌తంలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు కేసులు వేశారు. వీటిని వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌య‌త్ని స్తున్నారు. ఇది సాధ్యం కాని ప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే దీనిని రిసార్టుగా వినియోగించుకునేందుకు ప్ర‌య త్ని స్తోంది. దీనివ‌ల్ల స‌ర్కారుకు వ‌చ్చే ఆదాయం కంటే కూడా.. ఖ‌ర్చే ఎక్కువ‌గా ఉంటుంద‌ని లెక్క వేస్తున్నా రు. కాబ‌ట్టి.. ప్ర‌వేటు సంస్థ‌ల‌కు లీజుకుఇచ్చేందుకు మొగ్గుచూపుతున్న‌ట్టు స‌ర్కారు వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే స‌మ‌యంలో కేసులు పెట్టి విచార‌ణ చేయ‌డంపైనా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: