తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గులాబీ పార్టీని వీడెందుకు చాలా మంది కీలక నేతలు చూస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదటగా పార్టీ కండువా మార్చేశారు.


రెండు రోజుల కిందట తెలంగాణ లక్ష్మీ పుత్రుడుగా పేరుగాంచిన మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాదాపు పది సంవత్సరాలపాటు పదవులను అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాదులో ఉన్న దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కూడా... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు, ఖమ్మం జిల్లాలో కీలక రాజకీయ నాయకులు నామ నాగేశ్వరరావు కూడా పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

శనివారం రోజున బాలకృష్ణకు సంబంధించిన బసవతారకం ఆసుపత్రి వార్షికో త్సవం జరిగింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు... పాల్గొనడం హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణ తో చర్చలు కూడా చేశారట. మరికొన్ని రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలోకి నామ నాగేశ్వరరావు వెళ్తారని వార్తలు వస్తున్నాయి. కాగా మొదట.. తెలుగుదేశం పార్టీలో ఉన్న నామ నాగేశ్వరరావు... తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ టిడిపి వైపు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: