ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే.. ఏపీలో ఓడిపోయిన బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులను... కూల్చేసేందుకు రంగం సిద్ధం  చేస్తోంది చంద్రబాబు సర్కార్. సరైన అనుమతులు లేకుండా నిర్మించారనే నెపంతో... అధికారులు కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఋషికొండ ప్యాలెస్ పై... కూడా టిడిపి ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేస్తోంది.


ఇలాంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత నెలకొందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి నిన్న ఉదయం... పులివెందులకు వెళ్లారు జగన్. అయితే కడప ఎయిర్ పోర్టు నుంచి పులివెందులకు వెళ్తున్న సమయంలో... జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ఉన్న రెండు వాహనాలు యాక్సిడెంట్ కు గురయ్యాయి. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


అనంతరం పులివెందులకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ నేపథ్యంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చారు. ఈ తరుణంలోనే... ఎక్కువసేపు జగన్మోహన్ రెడ్డి నిల్చోవాల్సి వచ్చింది. గతంలో కాలి నొప్పితో జగన్ బాధపడిన సంగతి తెలిసిందే.  అయితే శనివారం రోజున ఎక్కువసేపు నిలబడ్డ కారణంగా... అదే నొప్పి మళ్ళీ తిరగబడింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కాలు మళ్లీ వాపు వచ్చిందట.


దీంతో అక్కడే ఉన్న వైద్యులు... జగన్మోహన్ రెడ్డికి టెస్టులు చేసి రెస్ట్ తీసుకోవాలని కోరారట.అయితే... వైద్యులు చెప్పిన సలహాలు... వినని జగన్మోహన్ రెడ్డి... మళ్లీ ఆదివారం కూడా ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రెండో రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ... ఓటమి గురించి కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. అయితే తన కాలు వాపు తగ్గకపోతే ఇవాళ సాయంత్రం విజయవాడ ఆస్పత్రికి జగన్ మోహన్ రెడ్డి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: