ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్కయ్యేలా.. రికార్డు విక్టరీతో కూటమి ప్రభుత్వం కొలువుతీరింది.తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆపి వేసిన అనేక పనులను తిరిగి ప్రారంభించే పనుల్లో భాగంగా చంద్రబాబు సిద్దమయ్యారు.దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలా వచ్చిందో లేదో.. మళ్లీ అన్న క్యాంటీన్లకు కళొస్తుంది. నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలన్న సంకల్పంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి.అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే పెద్దలకు పట్టెడు అన్నం పెట్టినవి వైసీపీ ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి. టీడీపీ హయాంలో పలుచోట్ల ఆ పార్టీ నేతలు స్వయంగా వీటిని ప్రారంభించి, విజయవంతంగా నడిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడు అన్నం దొరకకుండా చేసింది. దీంతో అనేకమార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే.తాజాగా కూటమి గెలిచాక మొదటిసారి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ జన్మదినం సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ను పున:ప్రారంభించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అయిన అన్న క్యాంటీన్‌లు త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రారంభం కానున్నాయి. దివంగత మాజీ సీఎం, తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయులు ఎన్టీఆర్ గారు ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరపురానివి. అయితే రాష్ట్ర విభజన తర్వాత అన్న క్యాంటీన్ ఏపీలో మాత్రమే ఉండేవి.అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో ఈసారి అన్న క్యాంటీన్ విస్తరణ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయాలనే ఆలోచన చంద్రబాబుకి రావడంతో హైదరాబాద్ పేద ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకులు జెనెక్స్‌ అమర్‌ తెలిపారు.మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో క్యాంటీన్‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో శనివారం రోజున జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందాయని అమర్ అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ క్యాంటీన్ ద్వారా జులై మొదటి వారంలో రోజూ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీబీఎన్‌ ఫోరం తరఫున కృషి చేస్తున్నట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: