అసెంబ్లీలో స‌భ్యులు కూర్చునే సీట్ల‌ను ఆదివారం స‌చివాల‌య సిబ్బంది నిర్ణ‌యించ‌నున్నారు. ఈ క్ర‌మం లో స‌భా నాయ‌కుడిగా ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు వారు చ‌ర్య‌లు తీసుకుని సీట్లు కేటాయిస్తారు. ప్ర‌స్తుతం కూట‌మి పార్టీల‌కు 164 స్థానాలు ఉన్న నేప‌థ్యంలో వీరికి ప్ర‌ధానంగా ముందు వ‌రుస‌ల్లోనే సీట్లు ల‌భించ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌క పోవ‌డంతో సాధార‌ణంగా వైసీపీ నాయ‌కుల‌కు.. చివ‌రి వ‌రుస‌ల్లోనే సీట్లు ద‌క్క‌నున్నాయి.


అయితే.. ఈ విష‌యంలో స‌భా నాయ‌కుడి నిర్ణ‌యం, స్పీక‌ర్ నిర్ణ‌యం మేరకు చ‌ర్య‌లు తీసుకుంటారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఈ విష‌యంపై దృష్టి పెట్టారు. అయితే.. సంఖ్యాబ‌లం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మాజీ ముఖ్య‌మంత్రి కావ‌డంతో గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో అనుస‌రించిన తీరునే చంద్ర‌బాబు అనుస‌రించే అవ‌కాశం ఉంది. 2004లో టీడీపీకి కేవ‌లం 26 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. అప్ప‌ట్లోనూ టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌లేదు.


కానీ, అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.. స్పీక‌ర్ చ‌ర్చించుకుని.. చంద్ర‌బాబు, ఆయ‌న స‌భ్యుల‌కు తొలి వ‌రుస‌లోనే సీట్లు కేటాయించారు. ఈ సంప్ర‌దాయాన్ని ప్ర‌స్తుతం రేవంత్‌రెడ్డి కూడా కొన‌సాగిస్తున్నారు. అయితే.. బీఆర్ ఎస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఉంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా లేదు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విలువ ఇస్తూ.. వారికి తొలి వ‌రుస‌లోనే సీట్లు కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.


దీనిపై వైసీపీ నేత‌, ఎమ్మెల్యే, మాజీ సీఎం జ‌గ‌న్ నుంచి కూడా.. అభిప్రాయం తీసుకుంటారా?  లేక చంద్ర‌బాబే తుది నిర్ణ‌యం తీసుకుంటారా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం తొలి వ‌రుస‌లో సీఎం చంద్ర‌బాబు ప‌క్క‌న కూట‌మి పార్టీల కీల‌క స‌భ్యుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కు సీటు కేటాయించారు. త‌ర్వాత‌.. మంత్రులు నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు కూర్చున్నారు. అయితే.. ఇవి బాబు అండ్ టీం తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌రి ఏంచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: