* రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు
* జనసేనలో సీనియర్ ఎంపీ
* కేంద్ర మంత్రి పదవికి అర్హుడు
* పవన్‌ కు నచ్చిన వ్యక్తి


జనసేన పార్టీ మంచి జోష్లో ఉంది. ఈసారి జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్  సంపాదించుకున్న జనసేన పార్టీ.. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా దూసుకెళ్తోంది. అలాగే ఏపీ సమస్యలు... ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని దానిపై జనసేన పార్టీ దృష్టి పెట్టింది. ఇక జనసేన పార్టీ నుంచి గెలుపొందిన వారిలో వల్లభనేని బాలశౌరి ఒకరు. దాదాపు 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు వల్లభనేని బాలశౌరి.


ఉన్న అన్ని పార్టీల్లో పని చేసి.. ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు. మూడుసార్లుగా పార్లమెంట్ ఎంపీగా పని చేసిన బాలశౌరి... వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బాలశౌరి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ0 అనంతరం... జగన్మోహన్ రెడ్డి తో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు బాలశౌరి.


జనసేన పార్టీ నుంచి... ఎంపీగా గెలిచిన బాలశౌరిపైన చాలా బాధ్యతలు ఉన్నాయి.  జనసేన పార్టీ బలమేంటో పార్లమెంటులో చూపించాల్సిన బాధ్యత సీనియర్ నాయకులైన బాలశౌరిపైన కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్రంలో...మిత్ర పక్షామైన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా నేపథ్యంలో... ఏపీ ప్రజల కష్టాలు తీర్చే అవకాశం బాల సౌరికి వచ్చింది. మచిలీపట్నం ఎంపీగా పనిచేస్తున్న బాలశౌరి... తన నియోజకవర్గాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనే దానిపై ప్లాన్ వేసుకోవాలి.


తన నియోజకవర్గానికి సంబంధించిన నిధులను దక్కించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావాల్సిన... నిధులు తెచ్చుకోగలగాలి. అదే సమయంలో... ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం కోసం నిధులను పార్లమెంట్ వేదికగా అడగాలి. మిత్రపక్షం అయినా సరే...  ఏపీ ప్రజల అభివృద్ధి కోసమే పని చేయాలి. ప్రతినిత్యం పార్లమెంటులో తన గళం విప్పాలి. తనకున్న రాజకీయ అనుభవంతో...  పార్లమెంటులో జనసేన హవా కొనసాగించాలి. అలాగే ఏపీ పార్లమెంట్ సభ్యులతో కలిసిమెలిసి... ఏపీ సమస్యలపై పోరాటం చేయాలి. అప్పుడే ఎంపీగా తన బాధ్యత... పూర్తి చేసినట్లు అవుతుంది. ఈ అంశాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: