ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న నాయకులలో మాగంట శ్రీనివాసులు రెడ్డి ఒకరు. ఈయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998 , 2004 , 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపి గా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచాడు. ఆ తర్వాత 1999 లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా , 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరి 2014 లో ఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆ తర్వాత 2015 లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసన మండలి సభ్యుని గా తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

మాగుంట శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16 న తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీ గా గెలిచాడు. ఆయన 2024 ఫిబ్రవరి 28 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మార్చి 16 న తెలుగు దేశం పార్టీలో చేరాడు. ఇక ఈ సారి ఎన్నికలలో తెలుగు దేశం తో పాటు జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి కొత్తలో భాగంగా పోటీలోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈయనకు మరోసారి ఒంగోలు పార్లమెంట్ స్థానం దక్కింది.

అందులో భాగంగా మాగుంట తన సమీప అభ్యర్థి అయినటువంటి వైసీపీ నేత భాస్కర రెడ్డి పై 50199 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దానితో ఈయన ఐదవ సారి లోక్ సభ లోకి అడుగు పెట్టబోతున్నారు. దీనితో ప్రస్తుతం బిజెపి , తెలుగు దేశం కలిసి ఉండటంతో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో ఈయన అత్యంత సీనియర్ నాయకుడు కావడం వల్ల మాగుంట ఆంధ్ర రాష్ట్ర సమస్యలను లోక్సభలో గొంతెత్తి వెల్లబుచ్చుతాడు అని చాలా మంది ఆంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక స్టేటస్ కీలకంగా మారాయి. వీటి గురించి ఈయన మాట్లాడుతారు అని జనాలు భావిస్తున్నారు. మరి ఈయన తన సీనియార్టీతో , తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆంధ్ర ప్రజలకు ఎలాంటి న్యాయాన్ని చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: