•పని మొదలుపెట్టేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని!
•తొలిసారి ఎంపీగా గెలిచినా ఎక్కడా తడబాటు లేదు!

(గుంటూరు - ఇండియా హెరాల్డ్): ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని ఇంగ్లిష్ లో ఓ సామెత ఉంది. ఈ సామెతని గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ నిజం చేసి చూపించి ఎంపీగా జనాల్లో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు. అధికారంలోకి రాగానే గెలిచాం కదా ఇక సాఫీగా రిలాక్స్ అవుతూ కూర్చుందాం అని అనుకోకుండా ఇప్పటి నుంచే తన పనిని మొదలు పెట్టేశాడు.కేంద్రం నుంచి నిధులు రాబట్టుకొని రాష్ట్రం ఇంకా జిల్లా అభివృద్ధే ధ్యేయంగా సేవలందిస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఈ స్పష్టతతో పెమ్మసాని పై జనాల్లో సానుకూలత, నమ్మకం పెరిగింది. పైగా బాగా ధనవంతుడు, ఇంకా బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో జనాలకు మేలు చేస్తారని నమ్ముతున్నారు.రాష్ట్రంలో గత పదేళ్లలో రైల్వే ప్రాజెక్టులు ఇంకా అలాగే బ్రిడ్జిలకు సంబంధించి ప్రతిపాదనలు ముందుకెళ్లలేదని, వాటిని గుర్తించి ఏ స్థాయిలో ఉన్నాయో పూర్తిగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకొస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ఈ మాటతో ఆయనపై జనాల్లో పాజిటివిటి పెరిగింది.

ప్రస్తుతం రైల్వే ప్రాజెక్టులు, 15 రకాల బ్రిడ్జిలు, పైవంతెనలు, ఆర్‌యూబీలకు రెండు వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇక పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను 30 నుంచి 60 రోజుల్లోపు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దేశించామన్నారు.గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, పెదపలకలూరు, మంగళగిరి, గుంటూరు నగరంలో శంకర్‌విలాస్‌ కూడలి, సీతానగరం, నెహ్రూనగర్, సంజీవయ్యనగర్‌ రైల్వే గేట్ల వద్ద ఓవర్‌ బ్రిడ్జ్, శ్యామలనగర్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణాల అనుమతుల వివరాలు ఇంకా అలాగే నందివెలుగు రోడ్డులోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనుల వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసానికి అధికారులు వివరించారు. పనుల వారీగా అనుమతుల మంజూరుకు రైల్వే శాఖ, ఆర్‌అండ్‌బీ ఇంకా స్థానిక సంస్థలు చేపట్టాల్సిన చర్యలను సమీక్షించి అధికారులకు పెమ్మసాని సూచనలు చేశారు.

వందే భారత్‌ రైలును తెనాలిలో నిలిపేలా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని రైల్వే అధికారులను కూడా ఆదేశించారు. అలాగే గుంటూరు నుంచి బెంగళూరుకు పగటి పూట రైలు ఏర్పాటుపై చర్చించారు. మంగళగిరి- తెనాలికి రెండు లైన్ల రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా తయారు చేయాలన్నారు. కొన్ని రోజుల్లో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఇలా భవిష్యత్తులో కూడా పెమ్మసాని యాక్టీవ్ గా ఉంటే ఆయనకి తిరుగుండదు. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై కూడా కేంద్రంలో చర్చిస్తే కేంద్ర మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విపరీతమైన పాజిటివిటీ సంపాదిస్తారు. మరి చూడాలి. ఫస్ట్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి మంచి పనులు చేస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: