ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి  విజయం సాధించింది. నాలుగోసారి బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి  మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.  ఇదే తరుణంలో రాష్ట్రంలో పాలన కూడా ఇప్పటికే మొదలైంది. దీంతో టిడిపి నాయకులు కూడా వైసిపి హాయంలో జరిగినటువంటి అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్ కు సంబంధించినటువంటి కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అలాంటి టిడిపి  ప్రభుత్వం ముందుగా టార్గెట్ చేసేది ఆ ముగ్గురు మాజీ మంత్రులనేనట. మరి ఆ మంత్రులు ఎవరు అనే వివరాలు చూద్దాం.. 

ఈ ముగ్గురు మంత్రులు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు పాల్పడ్డారట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొత్స సత్యనారాయణ. ఈయన టీచర్ల బదిలీ విషయంలో  అక్రమాలు చేశారని, టిడిపి పోలీసు బ్యూరో నెంబర్ అయినటువంటి వర్ల రామయ్య  ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఆ తర్వాత ప్లేస్ లో రోజా ఉంది. ఈమె క్రీడా శాఖ మంత్రిగా ఉంటూనే  ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారని అందులో స్కాం  పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె టూరిజం మినిస్టర్ గా కూడా ఉన్నారు.

ఈమె టూరిజం భవనాల పేరుతో ఋషికొండ మీద 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారట. ఈ నిర్మాణంలో ఎంత దుర్వినియోగం చేసారు కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరో సీనియర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన గనుల శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా ఈ శాఖలో విచ్చలవిడిగా అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఎర్రచందనం అక్రమ రవాణా కూడా చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా టిడిపి నాయకులంతా ముందుగా ఈ ముగ్గురు మంత్రుల భరతం పట్టి, ఆ తర్వాత మిగతా వారి అక్రమాలు కూడా బయటకు తీసుకురావాలని టిడిపి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరు నిజంగానే అక్రమాలు చేసినట్లయితే మాత్రం వీరికి జైలు కూడు తప్పదు అనేది జగమెరిగిన సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: